Goal: ప్రయత్నాలు ఫలించటంలేదా?

Eenadu icon
By Features Desk Published : 18 Sep 2025 02:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వార్షిక పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో మేటిగా నిలవాలంటూ లక్ష్యం నిర్దేశించుకుని అందుకోసం ఎంతోమంది విద్యార్థులూ, ఉద్యోగార్థులూ కృషిచేస్తుంటారు. కొందరు తమ ప్రయత్నాలను మధ్యలోనే ఆపేస్తుంటారు. దీన్ని అధిగమించాలంటే..

ఎంతో ఉత్సాహంగా కోరుకున్న కోర్సులో చేరాడు రిషి. ఆ తర్వాత కొన్ని రోజులకే తన వల్ల కావడంలేదంటూ మరోదాంట్లోకి మారిపోయాడు. రమ్య పరిస్థితీ ఇలాగే ఉంది. అత్యున్నత సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలనుకుంది. రెండు మూడుసార్లు ప్రయత్నించినా విఫలం  కావడంతో తన ప్రయత్నం ఆపేసింది. ఇలా ఎంతోమంది తమ ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకంటూ ఉంటారు.

  • ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడమేకాదు.. దాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయడమూ ఎంతో అవసరం. లేకపోతే ప్రయత్నాలు ఏళ్ల తరబడి అలా కొనసాగుతూనే ఉంటాయి. కోరుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు. కాబట్టి ఫలానా గడువు తేదీలోగానే పూర్తిచేయాలనే నియమాన్ని కచ్చితంగా పెట్టుకోవాలి. అందుకోసం రోజూ కొంత సమయం కేటాయించి కృషిచేయాలి.  
  • ఒక చిన్న పని మొదలుపెట్టే ముందు కూడా ‘ఇలా ప్రారంభించాలి.. అలా పూర్తిచేయాలి’ అని ఆలోచిస్తాం. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ప్రణాళిక మరింత కట్టుదిట్టంగా ఉండాలి కదా. అందుకోసం స్టడీ ప్లాన్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అమలుచేయగలగాలి. రోజువారీ, వారం, నెలకు సరిపడే ప్రణాళికలు వేసుకోవాలి.
  • ఏ రోజు చేయాల్సిన పనులను ఆరోజే చేయడం వల్ల భారం తగ్గిపోతుంది. ‘ఈరోజూ రేపం’టూ వాయిదాలు వేసుకుంటూ వెళితే ఎంత గొప్ప లక్ష్యమైనా సరే నీరుగారిపోతుంది. నిజానికి వాయిదాల పద్ధతికి దూరంగా ఉంటే సగం గమ్యాన్ని చేరుకున్నట్టే. 
  • కొందరు ఒకటి రెండుసార్లు విఫలం కాగానే ఇక తమ వల్ల కాదని ప్రయత్నాలను మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇలాంటప్పుడు లక్ష్యాన్ని సాధించినవారి అనుభవాలను వినడం, చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది. 
  • ప్రయత్నాలను మధ్యలోనే ఆపేసినవాళ్లకు.. ఇంకాస్త కష్టపడితే లక్ష్యాన్ని సాధించగలిగే వాళ్లమని బాధపడే సందర్భాలూ ఎదురవుతుంటాయి. చివరగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ప్రయత్నాలను ఆపనివారే విజేతలవుతారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని