Central Government Jobs: 2,049 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు షురూ

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.

Updated : 27 Feb 2024 21:45 IST

Central Government Jobs| దిల్లీ: కేంద్ర ప్రభుత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2, 049 పోస్టులకు అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో https://ssc.gov.in/ దరఖాస్తులు స్వీకరిస్తోంది. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు ఆయా పోస్టులకు అర్హులుగా పేర్కొంది. నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

ఎస్‌ఎస్‌సీ కొత్త వెబ్‌సైట్‌ ఇదే.. OTR మళ్లీ ఇలా చేసుకోండి!

  • ఫిబ్రవరి 26న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 18వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు పేమెంట్‌కు 19వరకు గడువు ఉంది. దరఖాస్తుల్లో సవరణలు చేసుకొనేందుకు మార్చి 22 నుంచి 24 వరకు ఛాన్స్‌. 
  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు కనీసం  18 ఏళ్లు నుంచి గరిష్ఠంగా 30 ఏళ్ల వయసు లోపువారు అర్హులు. కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు. 
  • దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన వారికి మినహాయింపు.
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
  • మే 6 నుంచి 8 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరుగుతాయి. తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
  • ఉద్యోగ హోదాలను బట్టి పే స్కేలు ఉంటుంది. 

ఉద్యోగ ఖాళీలు, హోదా, విద్యార్హతలు వేతనం, వయో పరిమితి, ఖాళీల సంఖ్య తదితర పూర్తి వివరాలను ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేసి పీడీఎఫ్‌లో చూడొచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని