వ్యాయామ ‘జ్ఞాపకం’!

చిన్నదైనా చాలు. వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికే కాదు, మెదడుకు కూడా. నడవటం, వ్యాయామ సైకిల్‌ తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలతోనూ జ్ఞాపకశక్తి ఎంతగానో మెరుగుపడుతున్నట్టు తాజా ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి.

Published : 04 Jun 2019 00:24 IST

చిన్నదైనా చాలు. వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికే కాదు, మెదడుకు కూడా. నడవటం, వ్యాయామ సైకిల్‌ తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలతోనూ జ్ఞాపకశక్తి ఎంతగానో మెరుగుపడుతున్నట్టు తాజా ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి. ముఖ్యంగా మతిమరుపుతో సతమతమవుతున్న వృద్ధులకైతే మరెంతో మేలు చేస్తుండటం గమనార్హం. ఇలాంటి వ్యాయామాలను ఆరు నెలల పాటు చేసినా మెదడు వయసు సుమారు 9 సంవత్సరాలు తగ్గినంత సమానంగా ఫలితం చూపుతుండటం విశేషం. దీంతో ఏకాగ్రత, ప్రవర్తన అదుపు, పనులు సక్రమంగా చేసుకోవటం వంటివి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక వ్యాయామాలకు పండ్లు, కూరగాయలు తినటం కూడా తోడైతే ప్రభావం మరింకింత పుంజుకుంటోంది కూడా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని