జీర్ణానికి వజ్రాసనం
తిన్న ఆహారం సరిగా జీర్ణంకాక కడుపుబ్బరం, తేన్పులతో బాధపడుతున్నారా? అయితే వజ్రాసనం వేయటం సాధన చేయండి. అతి ముఖ్యమైన యోగాసనాల్లో ఇదొకటి. ఇది మలద్వారం, జననాంగాలకు మధ్య ఉండే వజ్రనాడిని ప్రభావితం చేస్తుంది. కాబట్టే దీనికి వజ్రాసనం అని పేరు. భోజనం చేసిన తర్వాత వేసే ఆసనం ఇదొక్కటే.
ఎలా చేయాలి?
రెండు కాళ్లను తిన్నగా చాచి కూర్చోవాలి. ఒకదాని తర్వాత మరో కాలును మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి తీసుకురావాలి. పాదాలను పిరుదుల కిందికి తీసుకురావాలి. మడమలు ఎడంగా ఉంచుతూ.. బొటనవేళ్లు తాకేలా చూసుకోవాలి. అరచేతులను మోకాళ్ల మీద ఆనించి ఉంచాలి. శరీర బరువు పిరుదుల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. తల, వెన్నెముక నిటారుగా ఉంచాలి. కళ్లు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉండి తిరిగి మామూలు స్థితికి చేరుకోవాలి. కష్టంగా అనిపిస్తే ముందు ఒక పాదం మీద కూర్చోవటం సాధన చేయాలి. అనంతరం రెండు పాదాల మీద కూర్చోవాలి. వజ్రాసనం వేసేటప్పుడు ధ్యాసను శ్వాస మీద కేంద్రీకరించాలి. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు నొప్పి తగ్గేంతవరకు దీన్ని వేయకపోవటం మంచిది.
ప్రయోజనాలు
* తొడలు, మోకాళ్లు, పిక్కలను బలోపేతం చేస్తుంది.
* ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. భోజనం చేసిన 5-20 నిమిషాల తర్వాత వేస్తే ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, పులితేన్పులు, మొలలు, హెర్నియా నివారణకు తోడ్పడుతుంది.
* గర్భిణులకు కాన్పు తేలికగా అవటానికి దోహదం చేస్తుంది.
* వెన్నెముక కీళ్లు నాడులను నొక్కటం వల్ల వచ్చే సయాటికా నొప్పి తగ్గుముఖం పడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు
-
Movies News
Naga Vamsi: ‘ఈ పాప బుట్టబొమ్మలా లేదా?’ విలేకరికి నిర్మాత కౌంటర్
-
Sports News
IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్‌కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్
-
General News
Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
-
General News
Viveka murder case: వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు
-
Movies News
Jai Bhim: ‘జై భీమ్’ నంబరు 1.. ‘జనగణ మన’ నంబరు 2.. టాప్ 10 కోర్టురూమ్ డ్రామాలివీ