అజీర్ణానికి పసుపు కళ్లెం!

అజీర్ణ లక్షణాలు తగ్గటానికి పసుపులోని కర్‌క్యుమిన్‌ ఎంతో మేలు చేయగలదని తాజా అధ్యయనంలో బయటపడింది.

Published : 26 Sep 2023 01:13 IST

జీర్ణ లక్షణాలు తగ్గటానికి పసుపులోని కర్‌క్యుమిన్‌ ఎంతో మేలు చేయగలదని తాజా అధ్యయనంలో బయటపడింది. కడుపులో ఆమ్లం తగ్గటానికి వాడే ఒమిప్రజోల్‌ మందుతో సమానంగా ఇది పని చేస్తుండటం  విశేషం. పసుపులోని కర్‌క్యుమిన్‌కు వాపును తగ్గించే గుణాలు, సూక్ష్మక్రిములను కట్టడి చేసే సామర్థ్యం ఉన్నట్టు ఇప్పటికే తెలుసు. అందుకే గాయాలు తగ్గటానికి దీన్ని వాడుతుంటారు. కొన్నిచోట్ల జీర్ణక్రియను పెంచటానికీ వాడుతుంటారు. అయితే సంప్రదాయ మందులతో పోలిస్తే ఇదెంత సమర్థంగా పనిచేస్తుందనేది తెలియదు. దీన్ని గుర్తించటానికే థాయిలాండ్‌ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. అజీర్ణంతో బాధపడుతున్నవారిలో కొందరికి కర్‌క్యుమిన్‌, మరికొందరికి ఒమిప్రజోల్‌ మాత్రలు.. ఇంకొందరికి రెండూ కలిపి ఇచ్చి పరిశీలించారు. అందరిలోనూ నొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు దాదాపు సమానంగా తగ్గటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని