గుండెకు బెండ అండ

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారా? ఆహారంలో బెండకాయను చేర్చుకోండి. ఇది కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.

Published : 17 Oct 2023 00:32 IST

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారా? ఆహారంలో బెండకాయను చేర్చుకోండి. ఇది కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మనుషుల్లోనూ బెండకాయ ఇలాంటి ప్రభావమే చూపుతుందని కచ్చితంగా చెప్పలేకపోవచ్చు గానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ దండిగా ఉంటాయి. విజృంఖల కణాల పనిపట్టే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి. అంతేకాదు.. బెండకాయ రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చేస్తుంది. బెండకాయలో పీచూ ఎక్కువే. ఇవన్నీ పరోక్షంగా గుండెకు మేలు చేసేవే. గుండెజబ్బులను నివారించేవే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని