దాల్చిన ఆరోగ్యం

దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్‌, జింక్‌, క్యాల్షియం, క్రోమియం, మ్యాంగనీస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలూ ఉంటాయి.

Published : 31 Oct 2023 01:09 IST

దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్‌, జింక్‌, క్యాల్షియం, క్రోమియం, మ్యాంగనీస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలూ ఉంటాయి. దీనిలోని సినమల్‌డిహైడ్‌ అనే వృక్ష రసాయనం మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విశృంఖల కణాల పనిపట్టే ఇది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది. దీనిలో సాలిసైలిక్‌ ఆమ్లం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది కణాల్లో అంతర్గత వాపు ప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించటమే కాదు, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేయగలదు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు