పండ్ల రసాలు మంచివే కానీ..

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు బోలెడన్ని ఉంటాయి. వీటి రసాలను తాగటం ఇటీవల ఎక్కువైంది కూడా. కూల్‌డ్రింకుల వంటి వాటితో పోలిస్తే ఇవి మంచివే కావొచ్చు.

Published : 07 Nov 2023 01:47 IST

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు బోలెడన్ని ఉంటాయి. వీటి రసాలను తాగటం ఇటీవల ఎక్కువైంది కూడా. కూల్‌డ్రింకుల వంటి వాటితో పోలిస్తే ఇవి మంచివే కావొచ్చు. కానీ రసాలను తీయటం వల్ల కీలకమైన పీచును కోల్పోతున్నామనే సంగతి గుర్తించటం లేదు. ఆరోగ్యానికి పీచు ఎంతో అవసరం. కొన్ని పండ్లు, కూరగాయల్లో పీచు మధ్యలో పాలీఫెనాల్స్‌, యాంటీఆక్సిడెంట్లు దాగుంటాయి. కాబట్టి పీచును తీసేస్తే ఇలాంటి పోషకాలనూ కోల్పోయినట్టే. అంతేకాదు, పీచు కడుపు నిండిన భావన కూడా కలిగిస్తుంది. అందువల్ల త్వరగా ఆకలేయదు. జీర్ణక్రియ సాఫీగా సాగటానికి, కొలెస్ట్రాల్‌ తగ్గటానికి, రక్తంలో గ్లూకోజు స్థిరంగా ఉండటానికీ పీచు తోడ్పడుతుంది. పండ్లలోని చక్కెర పీచుతో కలిసి ఉంటుంది. శరీరం పీచును త్వరగా జీర్ణం చేసుకోలేదు కాబట్టి సహజ చక్కెరలు అంత త్వరగా రక్తంలో కలవవు. పీచును తొలగిస్తే సహజ చక్కెరల పనితీరూ మారుతుంది. ఇవి త్వరగా రక్తంలో కలుస్తాయి. అంతే త్వరగా వీటి మోతాదులు పడిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని