Diabetes : మధుమేహానికి శాకాహార కళ్లెం!

మధుమేహం ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలితో నివారించుకునే మార్గం లేకపోలేదు. మెడ్‌యునీ వియెన్సాస్‌ సెంటర్‌ తాజా అధ్యయనం దీన్ని మరోసారి రుజువు చేసింది.

Updated : 19 Dec 2023 08:47 IST

మధుమేహం ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలితో నివారించుకునే మార్గం లేకపోలేదు. మెడ్‌యునీ వియెన్సాస్‌ సెంటర్‌ తాజా అధ్యయనం దీన్ని మరోసారి రుజువు చేసింది. తాజా పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని పదార్థాలతో కూడిన శాకాహారంతో మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతున్నట్టు తేల్చింది. శాకాహారం మూలంగా జీవక్రియ, కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవుతున్నట్టు.. ఇవి మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఊబకాయం వంటి మధుమేహ ముప్పు కారకాలు, జన్యుపరంగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా కూడా శాకాహారం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుండటం విశేషం. అదే మిఠాయిలు, పొట్టు తీసిన ధాన్యాలు, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకుంటే మధుమేహం ముప్పు పెరుగుతోందనీ తేలింది. శాకాహారుల్లో రక్తంలో కొవ్వులు (ట్రైగ్లిజరైడ్లు), గ్లూకోజు (హెచ్‌బీఏ1సీ), వాపు ప్రక్రియ సూచికలు, ఇన్సులిన్‌ వంటి వృద్ధి కారకాల మోతాదులు తక్కువగా ఉంటున్నాయనీ, ఫలితంగా మధుమేహం ముప్పూ తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. మాంసాహారం, అధిక తీపి పదార్థాలు తగ్గించినా ఇలాంటి ఫలితమే కనిపిస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు