కాఫీ బలం!

వృద్ధాప్యంలో బలంగా ఉండాలనుకుంటే మధ్యవయసులో కాఫీ, టీ కాస్త ఎక్కువగా తాగి చూడండి. వీటి రూపంలో కెఫీన్‌ ఎక్కువగా తీసుకున్నవారికి మలి వయసులో శారీరక బలహీనత తక్కువగా ఉంటున్నట్టు నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యయనంలో తేలింది మరి.

Published : 19 Dec 2023 00:31 IST

వృద్ధాప్యంలో బలంగా ఉండాలనుకుంటే మధ్యవయసులో కాఫీ, టీ కాస్త ఎక్కువగా తాగి చూడండి. వీటి రూపంలో కెఫీన్‌ ఎక్కువగా తీసుకున్నవారికి మలి వయసులో శారీరక బలహీనత తక్కువగా ఉంటున్నట్టు నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యయనంలో తేలింది మరి. వృద్ధాప్యంలో సహజంగానే బలం, శారీరక, మానసిక సామర్థ్యం తగ్గుతాయి. దీంతో ఇతరుల మీద ఆధాపడాల్సి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని తగ్గించుకోవటానికి కెఫీన్‌ తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సగటున 53 ఏళ్ల వయసుగలవారిని ఎంచుకొని దాదాపు 20 ఏళ్ల పాటు పరిశీలించారు. అసలే కాఫీ తాగనివారితో పోలిస్తే- రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగినవారికి వృద్ధాప్యంలో దుర్బలత్వం వచ్చే అవకాశం తక్కువగా ఉంటోందని కనుగొన్నారు. రోజూ టీ తాగేవారిలోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. దీనికి కారణం కెఫీనేనని భావిస్తున్నారు. అలాగని కాఫీ, టీలు మరీ ఎక్కువగా తాగితే ప్రమాదమే. మితిమీరకుండా చూసుకుంటేనే మంచి ఫలితం కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని