పెరుగుతో హుషారు

పెరుగు పేగులకే కాదు.. మూడ్‌కూ మంచిదే. దీనిలోని ల్యాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి.. కుంగుబాటు, ఆందోళన నివారణకు తోడ్పడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు.

Published : 30 Apr 2024 00:05 IST

పెరుగు పేగులకే కాదు.. మూడ్‌కూ మంచిదే. దీనిలోని ల్యాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి.. కుంగుబాటు, ఆందోళన నివారణకు తోడ్పడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా ఎలుకల్లో కుంగుబాటును వెనక్కి మళ్లిస్తున్నట్టు ఇంతకుముందు బయటపడింది. అయితే దీనికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనాన్ని చేపట్టారు. రోగనిరోధక వ్యవస్థలో మధ్యవర్తిగా పనిచేసే ఇంటర్‌ఫెరాన్‌ గామా మోతాదులను ల్యాక్టోబాసిలస్‌ పర్యవేక్షిస్తున్నట్టు గుర్తించారు. ఇలా ఒత్తిడికి శరీరం స్పందించటాన్ని నియంత్రిస్తున్నట్టు.. కుంగుబాటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కనుగొన్నారు. దీంతో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ తయారీకి కొత్త సాధనాలు దొరికినట్టయ్యిందని భావిస్తున్నారు. మానసిక సమస్యలకు కొత్త చికిత్సల రూపకల్పనకిది దారితీయగలదని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని