అల్పాహారంతో.. శక్తి!

ఉదయం పూట మనం తీసుకునే ఆహారం.. ఆ రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్ని అందించే ఇంధనం లాంటిది. అందుకే ఉదయాన్నే ఏదో ఒకటి తినేద్దాం అనుకోవద్దు. తప్పనిసరిగా తినాల్సినవి...

Published : 26 Dec 2017 02:04 IST

అల్పాహారంతో.. శక్తి!

ఉదయం పూట మనం తీసుకునే ఆహారం.. ఆ రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్ని అందించే ఇంధనం లాంటిది. అందుకే ఉదయాన్నే ఏదో ఒకటి తినేద్దాం అనుకోవద్దు. తప్పనిసరిగా తినాల్సినవి కొన్నున్నాయి అంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డేవిడ్‌లుడ్విగ్‌ ...

* ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్‌ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు.

* పీచు తర్వాత మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటికోసం పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు తగిన ఆహారం. వీటి నుంచి మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా చేర్చుకోవచ్చు.

* టిఫిన్‌ అనగానే చాలామంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేస్తే పోలా అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లోనే తినడం మంచిది. తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్‌, బాదం... అక్రోట్‌ వంటి వాటిని తినొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని