వాట్సప్‌లో కేసుల లిస్టింగ్‌ సమాచారం

డిజిటైజేషన్‌ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్‌ సందేశాల రూపంలో పంపించనున్నారు.

Published : 26 Apr 2024 06:29 IST

న్యాయవాదులకు నేరుగా పంపిస్తాం: సీజేఐ

దిల్లీ: డిజిటైజేషన్‌ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్‌ సందేశాల రూపంలో పంపించనున్నారు. కాజ్‌ లిస్టులు (ఆ రోజు కోర్టు విచారించనున్న కేసుల జాబితా), కేసుల ఫైలింగ్‌, లిస్టింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని న్యాయవాదులకు వాట్సప్‌లో పంపిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ గురువారం ప్రకటించారు. కొత్త విధానం కింద.. న్యాయవాదులు, సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యే లిటిగెంట్లు కేసుల ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌, కాజ్‌ లిస్టులు, ఆర్డర్లు, తీర్పులను ఆటోమేటిక్‌గా పొందుతారని వెల్లడించారు. రిజిస్ట్రీ కాజ్‌ లిస్టులను సిద్ధం చేసిన వెంటనే బార్‌ సభ్యులు అందరికీ పంపుతుందన్నారు. సుప్రీంకోర్టు సేవలన్నింటినీ నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన మేఘరాజ్‌ క్లౌడ్‌ 2.0కు మార్చనున్నామని, దీంట్లోని డేటాను భారత్‌లోనే భద్రపరుస్తారని సీజేఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని