అవసరమున్న వారికే సాయం!
అదో చిట్టడవి. అందులో ఒక కాకి ఆహారం కోసం బయటికెళ్లి, కడుపు నింపుకొని తిరిగి వస్తుండగా.. దారిలో ఒక చిన్న మాంసం ముక్క కనిపించింది. దానితో మరో జీవి ఆకలి తీర్చాలనుకుంది.
అదో చిట్టడవి. అందులో ఒక కాకి ఆహారం కోసం బయటికెళ్లి, కడుపు నింపుకొని తిరిగి వస్తుండగా.. దారిలో ఒక చిన్న మాంసం ముక్క కనిపించింది. దానితో మరో జీవి ఆకలి తీర్చాలనుకుంది. ఆ ముక్కను నోట కరుచుకొని వెళ్తుండగా, ఓ నక్కను చూసింది. వెంటనే ఆ మాంసం ముక్కను దాని ముందు వేసింది. నక్క ఆ ముక్కను తినేసి.. ‘ఓ కాకీ.. ఇంత చిన్న మాంసం ముక్క తీసుకొస్తావా? ఇది నాకు ఎటూ సరిపోలేదు. పైగా నాకు సాయం చేశాననే పేరు వస్తుందని అనుకుంటున్నావా?’ అంటూ దెప్పిపొడిచింది. ఆ మాటలకు నొచ్చుకున్న కాకి.. ‘నేను ఏదో సాయం చేయాలని చూస్తే ఈ నక్క నన్నే తప్పు పడుతుందేంటి?’ అని మనసులోనే అనుకొని బాధపడింది.
కొద్దిరోజుల తర్వాత ఆ కాకికి మరో మాంసం ముక్క దొరికింది. దారిలో ఒక నక్క కనిపించినా, గత అనుభవంతో దానికి ఇవ్వకుండా వెనకే వస్తున్న తోడేలు ముందు వేసింది. దాన్ని గుటుక్కుమనిపించిన తోడేలు.. ‘ఓయ్.. నువ్వు ఎంగిలి చేసిన ఈ ముక్కను నాకు విసిరేస్తావా? ఇదేం గొప్ప పని కాదు. అసలే ఆకలితో ఉన్న నాకు ఇదేం సరిపోతుంది.. పెద్ద పెద్ద మాంసం ముక్కలు తెచ్చి పెట్టు’ అంది. ఆ మాటలకూ కాకి దిగాలు పడి.. ‘పెద్ద పెద్ద మాంసం ముక్కలు నాకు దొరకొద్దా.. ఒకవేళ దొరికినా, వాటిని మోసే శక్తి నాకు ఉండొద్దా ఏంటీ?’ అంది.
ఆ తర్వాత దానికి మరో మాంసం ముక్క దొరికితే, పులికి ఇచ్చింది. అది కూడా కాకిని సూటిపోటి మాటలు అన్నది. దానికీ కాకి బాధపడి, అటుగా వస్తున్న కుందేలుకు విషయం చెప్పింది. కుందేలు నవ్వి.. ‘అవసరం ఉన్న వాళ్లకే సాయం చేయాలి. నీ సహాయం వారికి కొంతైనా తృప్తిని కలిగించాలి. ఆ చిన్న మాంసం ముక్క నిజానికి ఆ పెద్ద జంతువులకు సరిపోదు. దాన్నే నువ్వు నీకంటే చిన్న ప్రాణులకు ఇస్తే, అవి సంబరపడేవి. అలా కాకుండా పెద్ద జంతువులకు అందించి, వాటితో మాటలు పడ్డావు. ఆకలి లేనివాటికి, కడుపు నిండిన వాటికి భోజనం పెడితే ఏం ప్రయోజనం? ఆహారం జాడ ఎక్కడుందో చెప్పి, నీకన్నా పెద్ద వాటికి సాయపడవచ్చు. అప్పుడు అవీ నిన్ను అభినందిస్తాయి’ అని హితబోధ చేసింది.
అప్పుడు కాకి.. ‘కుందేలు మామా.. ఎవరికి సాయం చేయాలో ఇప్పుడు తెలిసింది. ఇకనుంచి అలాగే చేస్తాను’ అంటూ రివ్వున ఎగిరింది.
మరుసటి రోజు కాకికి దొరికిన పండును ఆకలితో ఉన్న చిలుకకు ఇచ్చింది. ఇంకోసారి ఉడుతకు జామ కాయ అందించింది. అవి ఎంతో సంతోషించి.. దాని మంచితనాన్ని ఇతర పక్షులకూ చెప్పాయి. అప్పటి నుంచి ఆ కాకి, అవసరం ఉన్నవారికే సాయపడసాగింది. ఈ సంగతి మృగరాజు సింహానికి తెలిసి, దాన్ని తన వద్దకు పిలిపించింది. అది వెళ్లేసరికే అక్కడ నక్క, తోడేలు, పులి ఉన్నాయి. వాటన్నింటి ముందే కాకిని ఘనంగా సన్మానించింది సింహం. కాకిలాగే జీవులన్నీ తమకు తోచిన సాయం చేయాలని ఆదేశించింది. ‘సహాయం చేసిన వారి మనసును నొచ్చుకునేలా మాట్లాడితే, ఇంకోసారి ఎలా చేస్తారు?’ అని నక్క, తోడేలు, పులిని మందలించింది. దాంతో అవి కాకికి క్షమాపణలు చెప్పగా.. మిగతా జంతువులన్నీ చప్పట్లతో అభినందించాయి.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్‌కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు