అన్ని దేశాల సైనికులూ అక్కడే!

ఒక సైనికుడు ఖడ్గం పట్టుకుని దూసుకొస్తున్నాడు... మరో వీరుడు గుర్రాల రథంపై వస్తున్నాడు...ఇంకోవైపు యుద్ధట్యాంకులపై జవానులు వస్తున్నారు... ఒకేచోట అన్ని దేశాల సైనికులు యుద్ధం చేస్తున్నారు...ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా?

Published : 28 Mar 2016 00:38 IST

అన్ని దేశాల సైనికులూ అక్కడే!

ఒక సైనికుడు ఖడ్గం పట్టుకుని దూసుకొస్తున్నాడు... మరో వీరుడు గుర్రాల రథంపై వస్తున్నాడు...ఇంకోవైపు యుద్ధట్యాంకులపై జవానులు వస్తున్నారు... ఒకేచోట అన్ని దేశాల సైనికులు యుద్ధం చేస్తున్నారు...ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా?

కవైపు రథాలపై రాజులు వస్తుంటారు. మరో వైపు గుర్రాలపై, ఏనుగులపై సైనికులు విరుచుకుపడుతుంటారు. ఇలా ప్రాచీన కాలం నాటి యుద్ధ సన్నివేశాలే కాదు క్షిపణులు ప్రయోగాలు చేస్తున్న సైనికులు, యుద్ధట్యాంకులను పేలుస్తున్న జవానులు మరో వైపు ఆవేశంతో వూగిపోతుంటారు. ఇవన్నీ గిన్నిస్‌ రికార్డు చేసిన సైనికుల బొమ్మల సంగతులు.

* అమెరికా మకాన్‌కు చెందిన జోనాథన్‌ వాటర్స్‌కు దేశభక్తి మెండు. దాంతో ఆయన సైనికుల బొమ్మలు సేకరించాడు. ‘ప్రపంచంలోనే ఎక్కువ సైనికుల బొమ్మలను సొంతం చేసుకున్న వ్యక్తి’గా ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డు కూడా సంపాదించాడు.

* జోనాథన్‌ దగ్గర ఏకంగా 1020 సైనికుల బొమ్మలున్నాయి. 45 ఏళ్లున్న ఈయన ఈ బొమ్మలన్నింటినీ తను అయిదేళ్ల వయసున్నప్పటి నుంచి సేకరిస్తున్నాడు. 

* ఈ బొమ్మలన్నీ ఎంతో అబ్బురపరిచేలా ఉన్నాయి. ఏ బొమ్మకాబొమ్మ ఎంతో భిన్నంగా ఉండడమే వీటి ప్రత్యేకత. వీటిని సేకరించడానికి ఇతను దేశదేశాలూ తిరిగాడు. అలనాటి కాలంలో జరిగిన యుద్ధాల్లో కనిపించే సైనికుల దగ్గర్నించి నేటి ఆధునిక సోల్జర్స్‌ బొమ్మల వరకు ఇందులో ఉన్నాయి.

 * వీటిని జాగ్రత్తగా ఎవరూ తాకకుండా ఒక చోట ప్రదర్శనకు పెట్టాడు. జోనాథన్‌ దగ్గర మొత్తం 5000 సైనికుల బొమ్మలు ఉన్నాయి. అయితే వీటిల్లో 1020 మాత్రమే మరో బొమ్మను పోలి లేకపోవడంతో వీటికే గిన్నిస్‌ రికార్డు వచ్చింది.

 * ఇప్పటి వరకు ఎక్కువ సైనికుల బొమ్మలున్న వ్యక్తిగా రష్యాకు చెందిన స్పసోవ్‌కు రికార్డు ఉండేది. ఆయన దగ్గర 661 మాత్రమే ఉన్నాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని