Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 27 Apr 2024 05:18 IST

మేషం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం చదవాలి.

వృషభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనఃశ్శాంతి లభిస్తుంది. శని శ్లోకం చదవండి.

మిథునం

ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. శ్రీవిష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

కర్కాటకం

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

సింహం

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

కన్య

మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నాఅధిక ధనలాభాలను పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

తుల

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం మీలోని ఆత్మశక్తిని పెంచుతుంది.

వృశ్చికం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధనుస్సు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

మకరం

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

మీనం

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు .ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని