ప్రపంచంలోనే పొడవైన వీధి...అతి చిన్న కారాగారం!

కెనడా జాతీయ పతాకం 1:2 పొడవు వెడల్పుతో ఉంటుంది. మధ్యలో తెలుపు రంగులో ఎర్రని మేపుల్‌ ఆకు, అటూ ఇటూ ఎర్రని రంగులు ఉంటాయి.తెలుపు రంగు శాంతి, నిజాయితీని, ఎరుపు రంగు ధైర్యం, శ్రమ, బలాన్ని సూచిస్తే మేపుల్‌ ఆకు కెనడా ప్రకృతికి చిహ్నం.

Published : 03 Apr 2016 02:11 IST

ప్రపంచంలోనే పొడవైన వీధి...అతి చిన్న కారాగారం!

కెనడా
రాజధాని: ఒట్టావా
జనాభా: 36,048,521
విస్తీర్ణం: 9,984,670 చదరపు కిలోమీటర్లు
భాషలు: ఆంగ్లం, ఫ్రెంచ్‌
కరెన్సీ: కెనడియన్‌ డాలర్‌

కెనడా జాతీయ పతాకం 1:2 పొడవు వెడల్పుతో ఉంటుంది. మధ్యలో తెలుపు రంగులో ఎర్రని మేపుల్‌ ఆకు, అటూ ఇటూ ఎర్రని రంగులు ఉంటాయి.
* తెలుపు రంగు శాంతి, నిజాయితీని, ఎరుపు రంగు ధైర్యం, శ్రమ, బలాన్ని సూచిస్తే మేపుల్‌ ఆకు కెనడా ప్రకృతికి చిహ్నం.

* ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వైశాల్యంగల దేశం.
* ఇక్కడ క్షమాపణ చట్టం ఉంది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ క్షమించమని చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పుకున్నట్టు కాదనీ, దాన్ని కోర్టులో సాక్ష్యంగా పరిగణించకూడదనీ 2009లో క్షమాపణ చట్టం ఏర్పాటుచేశారు.
* ప్రపంచం మొత్తంగా ఉన్న అడవుల్లో 10 శాతం కెనడాలోనే ఉన్నాయి.
* కెనడా అనేది 'కెనట’ అనే పదం నుంచి వచ్చింది. స్థానిక భాషలో దీనర్థం ుఆవాసం’, లేదా గ్రామం అని.
* కెనడాలో 55 వేలకుపైగా కీటక జాతులు ఉన్నాయి.

* ఇక్కడ దాదాపు 30 వేల సరస్సులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సుల్లో ఇది అరవై శాతం.

* ఎక్కువ మంది విద్యావంతులున్న దేశంగా కూడా దీనికి పేరుంది.

* ఒంటారియోలో ప్రపంచంలోనే అతి చిన్న కారాగారం ఉంది. ఇది 24.3 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

* ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు యూఎస్‌, కెనడాల మధ్య ఉంది.
* ఇది ప్రపంచంలోనే అతి పొడవైన తీర రేఖగల దేశం. ఏకంగా 2,02,080 కిలోమీటర్ల పొడవుంటుంది.

* ప్రపంచంలోనే అతి పొడవైన వీధి ఇక్కడే ఉంది. పేరు యంగ్‌ స్ట్రీట్‌. సుమారు 2,000 కిలోమీటర్ల పొడవుంటుంది.

* టోరంటో స్థాపకుడు జాన్‌ గ్రేవ్స్‌ సిమ్‌కో తన స్నేహితుడూ, ప్రాచీన రోమన్‌ రహదారుల నిపుణుడైన జార్జ్‌ యంగ్‌ పేరు మీదుగా ఈ వీధికి పేరు పెట్టారు.
* యంగ్‌ సబ్‌ వే మార్గం కెనడాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భూగర్భ మెట్రో సిస్టమ్‌. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని