స్థూలకాయుల దేశం!

నౌరు దేశపు జెండాలో నీలం రంగు పసిఫిక్‌ మహాసముద్రాన్ని, నీలాకాశాన్ని సూచిస్తుంది. భూమధ్యరేఖకు దిగువన ఉందని చెప్పడానికి పసుపు రంగు గీతను వాడారు. దేశంలోని 12 తెగల ప్రజల్ని చూపేలా నక్షత్రపు గుర్తు పెట్టారు. 95 శాతం మంది అధిక బరువుతో ఉండటం వల్ల ఈ దేశాన్ని ‘ఫ్యాటెస్ట్‌ నేషన్‌’గా పిలుస్తారు.

Published : 24 Apr 2016 01:55 IST

 

స్థూలకాయుల దేశం!
నౌరు


జెండా

 నౌరు దేశపు జెండాలో నీలం రంగు పసిఫిక్‌ మహాసముద్రాన్ని, నీలాకాశాన్ని సూచిస్తుంది. భూమధ్యరేఖకు దిగువన ఉందని చెప్పడానికి పసుపు రంగు గీతను వాడారు. దేశంలోని 12 తెగల ప్రజల్ని చూపేలా నక్షత్రపు గుర్తు పెట్టారు.


* 95 శాతం మంది అధిక బరువుతో ఉండటం వల్ల ఈ దేశాన్ని ‘ఫ్యాటెస్ట్‌ నేషన్‌’గా పిలుస్తారు.


* రైలు మార్గం కేవలం అయిదు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాంతంలో అధికంగా ఉండే ఫాస్పేట్‌ రవాణా కోసం దీన్ని ఉపయోగిస్తారు.


* ఇక్కడ వాణిజ్య పంటగా కొబ్బరిని మాత్రమే పండిస్తారు.


* అతిచిన్న గణతంత్రరాజ్యం ఇదే.

 * ఒకే ఒక విమానాశ్రయం ఉంది.


* రోడ్డు మార్గం మొత్తం కలిపితే 30 కిలోమీటర్ల పొడవే ఉంటుంది.
* పర్యటకులు చేపలు పట్టడం, ఈతకొట్టడానికి వస్తుంటారు.


* ఈ దేశానికి సైనికదళాలు లేవు.
* నౌరు దేశం పసిఫిక్‌లో ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ద్వీపదేశం.

రాజధాని: యారెన్‌
జనాభా: 10,084
విస్తీర్ణం: 21 చదరపు కిలోమీటర్లు
భాషలు: నౌరువన్‌, ఆంగ్లం
కరెన్సీ: ఆస్ట్రేలియన్‌ డాలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని