కళ్లు తిరిగే ఎత్తులో...వూపిరందని దారిలో!

ఆ దారి గుండా వెళ్లడమంటేనే ఓ సాహసం చేసినట్టు. ఎన్నో మలుపులతో, ఎత్తయిన పర్వతాల మీదుగా సాగుతుందా మార్గం. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రోడ్డుమార్గాల్లో ఇదీ ఒకటి. ఇంతకీ ఎక్కడుందో తెలుసా? మనదేశంలోనే. జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిల మధ్య ఉండే ‘లేహ్‌-మనాలి హైవే’ ఇది.

Published : 29 Apr 2016 01:18 IST

కళ్లు తిరిగే ఎత్తులో...వూపిరందని దారిలో!

 

ఆ దారి గుండా వెళ్లడమంటేనే ఓ సాహసం చేసినట్టు. ఎన్నో మలుపులతో, ఎత్తయిన పర్వతాల మీదుగా సాగుతుందా మార్గం. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రోడ్డుమార్గాల్లో ఇదీ ఒకటి. ఇంతకీ ఎక్కడుందో తెలుసా? మనదేశంలోనే.

* జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిల మధ్య ఉండే ‘లేహ్‌-మనాలి హైవే’ ఇది.

* మొత్తం 479 కిలోమీటర్ల పొడవుండే ఈ హైవే మన దేశం మొత్తంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గం. సముద్రమట్టానికి 17,470 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపై చివరి వరకు ప్రయాణించాలంటే రెండురోజులపైనే పడుతుంది.

* ఈ దారిలో యాత్రికుల్ని జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు మాత్రమే అనుమతిస్తారు. అప్పుడు కూడా మధ్యలో బోలెడు అడ్డంకులు. కొండ చరియలు విరిగిపడుతుంటాయి. నీటి కాలువల్లో నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నో సొరంగాల గుండా సాగాలి. ఇరుకైన వంతెనలు దాటాలి.

* కళ్లు తిరిగే ఎత్తులో ఉండే ఈ మలుపుల రహదారిపై వెళ్లాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి. ఎత్తయిన పర్వతాల మీదుగా వెళుతుంటే కొన్ని చోట్ల ప్రాణవాయువు తక్కువగా అందుతుంది.

* భారత సైన్యానికి చెందిన ‘బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌’ ఈ మార్గాన్ని నిర్మించి నిర్వహిస్తోంది. అత్యంత బరువుగా ఉండే సైనిక వాహనాలను తట్టుకునేలా రహదారిని దృఢంగా వేశారు. ఇక్కడ మోటారు సైకిళ్లపై సాహస యాత్రలు చేస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని