ఈ ఇళ్లు... బుజ్జాయిల బొమ్మరిళ్లు!

పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం మట్టితోనో, చెక్కతోనో చిన్న ఇళ్లు కట్టిస్తుంటాం. లేదంటే పిల్లలు దూరి ఆడుకునేలా ఉండే ప్లాస్టిక్‌ ఇళ్లను తెచ్చిపెడతాం. కానీ అమెరికాకు చెందిన అలన్‌ మోవర్‌ అనే అర్కిటెక్ట్‌ మాత్రం చిన్నారుల కోసం ప్రత్యేకమైన ఇళ్లను నిర్మిస్తున్నాడు. ఇంటి పెరడు లేదా ఖాళీ స్థలం చూపిస్తే అచ్చంగా మన ఇళ్లను తలపించేలా అందంగా కట్టిస్తున్నాడు. * ప్రపంచంలోనే విలాసవంతమైన ఈ ఇళ్లకు ఆదరణ బాగా పెరిగిపోయింది.

Published : 27 May 2016 01:00 IST

ఈ ఇళ్లు... బుజ్జాయిల బొమ్మరిళ్లు!

పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం మట్టితోనో, చెక్కతోనో చిన్న ఇళ్లు కట్టిస్తుంటాం. లేదంటే పిల్లలు దూరి ఆడుకునేలా ఉండే ప్లాస్టిక్‌ ఇళ్లను తెచ్చిపెడతాం. కానీ అమెరికాకు చెందిన అలన్‌ మోవర్‌ అనే అర్కిటెక్ట్‌ మాత్రం చిన్నారుల కోసం ప్రత్యేకమైన ఇళ్లను నిర్మిస్తున్నాడు. ఇంటి పెరడు లేదా ఖాళీ స్థలం చూపిస్తే అచ్చంగా మన ఇళ్లను తలపించేలా అందంగా కట్టిస్తున్నాడు.

* ప్రపంచంలోనే విలాసవంతమైన ఈ ఇళ్లకు ఆదరణ బాగా పెరిగిపోయింది.

* పదడుగుల ఎత్తుండే ఈ ఇళ్లలో అలంకరణ వస్తువులు, మంచాలు, కుర్చీలతో పాటు విద్యుత్తు, నీరు, ఏసీ ఇలా బోలెడు వసతులు ఉంటాయి. మన ఇంట్లోలాగా ఇందులోనూ వంట చేసుకోవడానికీ, పడుకోవడానికీ, చదువుకోవడానికీ, ఆడుకోవడానికీ ఇలా దేనికదే ప్రత్యేక గదులు ఉంటాయి. కాకపోతే ఆటవిడుపుకే ఈ ఇళ్లన్నీ.

* అంతే కాదండోయ్‌ ఈ బుల్లి ఇళ్ల బయట పూదోటలూ, ఆడుకోవడానికి జారుడుబల్లలూ ఉంటాయి.

* పిల్లల ఇళ్లే కదా అని తక్కువ ధరకే ఉంటాయనుకోకండి. నిర్మాణం, వసతుల్ని బట్టి ఈ ఇళ్ల ధర ఆరు లక్షల నుంచి యాభైలక్షల వరకూ ఉంటుంది.

* ఇంతకీ అలన్‌కి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అలన్‌ తన మూడేళ్లకూతురు బార్బీబొమ్మలతో ఆడుకోవడానికి వీలుగా ఓ చిన్న ఇంటిని నిర్మించాడు. అది అందరికీ భలేగా నచ్చడంతో అలాంటివే ఇతర పిల్లలకూ అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అడిగినవారి అభిరుచుల మేరకు వైవిధ్యంగా, సృజనాత్మకంగా నిర్మిస్తాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని