Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Apr 2024 16:59 IST

1.బుగ్గన నామినేషన్‌ పెండింగ్‌లో ఉంచిన ఎన్నికల అధికారి

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వైకాపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌పై తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలయ్యింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి (Election Commission) నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

 జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. లక్ష్మీనారాయణ జైభారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్వాగతించారు. ఈసందర్భంగా విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు వారు క్షమాపణలు చెప్పాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మోదీ గ్యారెంటీ: అమిత్‌షా

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని కచ్చితంగా అమలుచేస్తుందనడానికి ప్రధాని మోదీ గ్యారెంటీ అని హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ‘పర్సనల్‌ లా’కు వకాల్తా పుచ్చుకొంటోందని ఆయన విమర్శించారు. శుక్రవారం మధ్యప్రదేశలోని గుణా లోక్‌సభ పరిధిలోని పిప్రాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. వారసత్వ పన్నుతో దేశం వెనక్కి.. కాంగ్రెస్‌పై నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు

వారసత్వ పన్నుపై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ తనదైన శైలిలో విరుచుకుపడుతుండగా.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ పన్ను వల్ల దేశం మళ్లీ వెనక్కి పోతుందని, ఈ పదేళ్లు చేసిన అభివృద్ధి కాస్త మళ్లీ సున్నాకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వైకాపాకు మరో షాక్‌.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్‌ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైకాపా క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ టికెట్‌ను ఆశించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ

రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్‌

గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా జో బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా (USA) విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటుచేసుకున్న నిరసనల్లో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో భారత సంతతికి చెందిన విద్యార్థిని ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. డీజీసీఏ కొత్త రూల్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?

విమాన టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సేవలకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది అనవసర భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగా ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)’ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని