US-India: భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్‌: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య

US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు.

Published : 26 Apr 2024 17:13 IST

దిల్లీ: అమెరికా (USA)లో భారతీయులు (Indians) పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి (Eric Garcetti) అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో (CEO) అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు భారతీయులైతే అమెరికాలో సీఈవో కాలేరని గతంలో ఓ జోక్‌ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహం లేదు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, స్టార్‌బక్స్‌ లాంటి కంపెనీలే ఉదాహరణ. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జాబితాలో ప్రతీ 10 మంది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారు’’ అని గార్సెట్టి వ్యాఖ్యానించారు. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్‌-యూఎస్‌ నిలుస్తున్నాయని అన్నారు.

డీజీసీఏ కొత్త రూల్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?

ఈసందర్భంగా ఇటీవల అగ్రరాజ్యంలో వరుసగా చోటుచేసుకుంటున్న భారతీయులు, భారత సంతతి విద్యార్థుల మరణాలపై ఆయన స్పందించారు. ‘‘అమెరికాలో దాదాపు 2.40లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. వీటిని నివారించేందుకు మేం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ విద్యార్థి శ్రేయస్సుపై మేం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారు తమ సొంత ప్రాంతంలోనే ఉన్నామన్న భావన కలిగించేలా భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని