మోగని గంటలు.... గుహలో వింతలు!!

అనగనగా ఓ కొలనుంది... అందులో ఒక గుహ... ఆ గుహలో ఉందో వింత... ఇంతకీ ఏంటది? ఆ గుహలో అడుగుపెట్టగానే బోలెడు గంటలు మనకు కనిపిస్తాయి. అవి అలా ఇలా కాదు మనుషులంత పెద్దగా ఉండే గంటలు. పైగా ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా ఉంటాయి. మరి త్వరగా ఆ వివరాలేంటో చదివేద్దామా!

Published : 22 Nov 2016 01:04 IST

మోగని గంటలు.... గుహలో వింతలు!!

అనగనగా ఓ కొలనుంది... అందులో ఒక గుహ... ఆ గుహలో ఉందో వింత... ఇంతకీ ఏంటది?
ఆ గుహలో అడుగుపెట్టగానే బోలెడు గంటలు మనకు కనిపిస్తాయి. అవి అలా ఇలా కాదు మనుషులంత పెద్దగా ఉండే గంటలు. పైగా ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా ఉంటాయి. మరి త్వరగా ఆ వివరాలేంటో చదివేద్దామా!

* గంటలనగానే గుళ్లొనో, బళ్లొనో ఉండే గంటలనుకోకండి! ఇవి నిజమైన గంటలు కావు. కానీ గంటల ఆకారాల్లో ఏర్పడ్డ నిర్మాణాలు. గంటల్ని పోలి ఉన్నాయి కాబట్టి వీటిని ‘హెల్స్‌ బెల్స్‌’ (నరకపు గంటలు) అనే పేరుతో పిలుస్తారు.
* పైనుంచి వేలాడుతూ కనిపించే వీటి స్వరూపాన్ని బట్టి ఏనుగు పాదం, బూర, షవర్‌ హెడ్స్‌ అంటూ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి.
* చూడాలంటే విమానం ఎక్కి మెక్సికోలోని యుకటనాకు వెళ్లాల్సిందే.
* ఇక్కడి కెనోట్‌ జాపోట్‌ అనే చిన్న కొలనులో ఉంటుందీ గుహ. ఉపరితలం నుంచి వంద అడుగుల లోతులో నీటితో నిండి ఉంటుంది. పైకప్పు నుంచి రకరకాల పరిమాణాల్లో కిందికి వేేళాడుతున్న గంటను పోలిన ఆ ఆకారాలే ఈ గుహ అసలు ప్రత్యేకత.

* ఇవి ఎందుకు ఏర్పడ్డాయో కచ్చితంగా తెలియకపోయినా మంచు యుగం నుంచి ఒకరకమైన ప్రత్యేక పదార్థం పొరలు పొరలుగా రూపొందడం వల్ల ఈ ఆకారాలు తయారై ఉంటాయని భావిస్తున్నారు.
* ఈ గుహలోకి వెళ్లడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే గుహ దారి సన్నగా ఇరుగ్గా ఉంటుందిట. దీన్ని అధిగమించాలంటే డైవింగ్‌లో అనుభవం ఉండాలి మరి.
* ఇక్కడికి వందలాదిమంది సాహసికులు వచ్చి తమ సరదా తీర్చుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని