ఆకారాలు మహా... రికార్డులు ఆహా!

జానెడు పొడవుండే అల్లికల సూదులు ఇక్కడ మాత్రం పదమూడు అడుగులున్నాయి... ఒక్కరికి సరిపోయే కుర్చీ ఎంతోమంది పట్టేలా ఉంటుందిక్కడ... మన కాలికి సరిపోయే బూట్లు ఏకంగా మనం కూర్చునేలా ఉంటాయి... ఇవన్నీ మాయాలోకంలో ఉండే భారీ వస్తువుల గురించి కాదండోయ్‌... మరేంటో చదివేయండి! అది పేరుకు చిన్నగ్రామమే. కానీ ప్రపంచంలోనే పెద్దసైజు వస్తువులకు చిరునామా.

Published : 09 Jan 2017 01:14 IST

ఆకారాలు మహా... రికార్డులు ఆహా!

  జానెడు పొడవుండే అల్లికల సూదులు ఇక్కడ మాత్రం పదమూడు అడుగులున్నాయి... ఒక్కరికి సరిపోయే కుర్చీ ఎంతోమంది పట్టేలా ఉంటుందిక్కడ... మన కాలికి సరిపోయే బూట్లు ఏకంగా మనం కూర్చునేలా ఉంటాయి... ఇవన్నీ మాయాలోకంలో ఉండే భారీ వస్తువుల గురించి కాదండోయ్‌... మరేంటో చదివేయండి!
ది పేరుకు చిన్నగ్రామమే. కానీ ప్రపంచంలోనే పెద్దసైజు వస్తువులకు చిరునామా. అందుకే ఈ ­రిని ‘బిగ్‌ థింగ్స్‌ ఇన్‌ ఏ స్మాల్‌ టౌన్‌’గా పిలుస్తారు. ఈ ­రు పేరు కేసీ. అమెరికా ఇల్లినాయిస్‌లో ఉందిది.
* భారీ పరిమాణాలతో ఉండే కుర్చీ, మెయిల్‌బాక్స్‌, ఫోర్క్‌, గోల్ఫ్‌ ట్రీ, చెక్కబూట్లు వంటివెన్నో ఈ ­ళ్లొ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలోనే పెద్దవిగా గిన్నిస్‌ రికార్డులు కూడా దక్కించుకున్నాయి.


* ఇక్కడి మెయిల్‌ బాక్స్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. 2015లో ఏర్పాటు చేసిన ఈ మెయిల్‌ బాక్స్‌ ఓ పెద్ద గదంత ఉంటుంది. పైకి ఎక్కేలా మెట్ల దారితో ఉండే ఇది భలేగా కనిపిస్తుంది.


* అడుగంత ఉండే బూట్లే మనకు తెలుసు. కానీ ఇక్కడి చెక్కబూట్లు ఏకంగా పదకొండు అడుగుల అయిదు అంగుళాల పొడవు, అయిదు అడుగుల పది అంగుళాల వెడల్పు ఉంటాయి. వీటి బరువు 680 కిలోలు. పైన్‌ వృక్షాల కలపతో చైన్‌సా లాంటి పనిముట్లు ఉపయోగించి వీటిని రూపొందించారట.
* పొడవైన గోల్ఫ్‌ ట్రీని కూడా చూడొచ్చు. దీని ఎత్తు ముప్ఫై అడుగుల తొమ్మిది అంగుళాలు.


* ఇక్కడున్న అతిపెద్ద ఫోర్క్‌పై ఎంచక్కా మనం ఎక్కేయొచ్చు. ఇది ఏకంగా 8 అడుగుల నాలుగు అంగుళాల వెడల్పు, 61 అడుగుల 2 అంగుళాల పొడవుంటుంది.
* ఎంతో ఎత్తులో ఉండే కుర్చీ భలే గమ్మత్తుగా ఉంటుంది. బరువు 20,955 కిలోలు. కలప, స్టీలుతో చేసిన ఈ కుర్చీ 56 అడుగుల ఒక అంగుళం ఎత్తు, 32 అడుగుల 9 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. అంటే దీంట్లో పదుల సంఖ్యలో సందర్శకులు కూర్చోడానికి వీలుంటుందన్నమాట.
* ఇవేకాక 13 అడుగులుండే అతి పొడవైన అల్లిక సూదులూ ఉంటాయి.


* ఇంతకీ వీటన్నింటినీ ఎవరు తయారు చేశారు అంటే.. అరవై ఏళ్ల జిమ్‌ బొలిన్‌ అనే తాతయ్య. ఈయన ఓ వ్యాపారవేత్త. తన ­రి గొప్పతనాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. కళాకారుల్నీ, నిపుణులైన పనివారినీ నియమించుకుని ఇలా వినూత్నంగా పేద్ద పేద్ద వస్తువుల్ని తయారు చేయించడం మొదలుపెట్టాడు.
* అయితే వీటి తయారీకి పాడైపోయిన, మూలన పడేసిన ఇనుప వస్తువుల్ని ఉపయోగించడం విశేషం.
* ప్రపంచంలోనే ఎత్తయిన ఈ వస్తువుల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని