పొడుచుకు వచ్చిన అగ్ని పర్వతాలు!

ప్రపంచంలోనే అతి పేద్ద అగ్ని పర్వతాలు... ఉన్నది అమెరికాలోని హవాయిలో. అసలు అవి అంత పెద్దగా ఎందుకు ఏర్పడ్డాయి? అక్కడే ఎందుకున్నాయి? ఏకంగా 168 ఏళ్లుగా అది ఎవ్వరికీ అంతుపట్టని రహస్యమే. చాలా పరిశోధనలు చేశాక ఆ కారణాల్ని ఇప్పటికి మన శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు....

Published : 12 May 2017 01:47 IST

పొడుచుకు వచ్చిన అగ్ని పర్వతాలు!

ప్రపంచంలోనే అతి పేద్ద అగ్ని పర్వతాలు... ఉన్నది అమెరికాలోని హవాయిలో. అసలు అవి అంత పెద్దగా ఎందుకు ఏర్పడ్డాయి? అక్కడే ఎందుకున్నాయి? ఏకంగా 168 ఏళ్లుగా అది ఎవ్వరికీ అంతుపట్టని రహస్యమే. చాలా పరిశోధనలు చేశాక ఆ కారణాల్ని ఇప్పటికి మన శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు.

* భూమి లోపల చిక్కటి ద్రవరూపంలో ఉండే శిలాద్రవం (మాంటిల్‌)పై టెక్టానిక్‌ ప్లేట్స్‌ అనే భూఫలకాలు ఉంటాయని తెలుసుగా? వాటి మీదనే మనం నడిచే నేల, పర్వతాలు, సముద్రాలు ఉంటాయి. అవి తెప్పల్లాగా మెల్లగా కదులుతూ ఉంటాయి.

హవాయి దీవులు ఉన్నది పసిఫిక్‌ మహా సముద్రంలో. ఆ సముద్రపు అడుగునున్న భూమి అంతర్భాగంలో పసిఫిక్‌ ప్లేట్‌ అని పిలిచే ఓ పేద్ద ఫలకం ఉంది. భూమిలో ఉన్న ఫలకాల్లో ఇదే అతి పెద్దది.

30 లక్షల ఏళ్ల క్రితం ఇది మరో ఫలకంతో ఢీకొంది. ఆ తాకిడికి అవి భూమిపైకి పొడుచుకు వచ్చాయి. వాటి నెర్రల్లోంచే ఈ అగ్ని పర్వతాలు ఏర్పడ్డాయి. అదన్నమాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని