గిర్ర్‌ర్‌ర్‌... భలే సాహసం!

సాహసికులు మాత్రమే చేసే రైడది. ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి మరి. ఎందుకంటే ఆ రైడు మలుపులు తిరగడం, పైకీ కిందకీ పల్టీకొట్టడం మాత్రమే చేయదు. ఏకంగా గుండ్రంగా తిప్పేస్తుంది. అన్ని కోణాల్లో చుట్టూ తిరిగిపోతుంది. దీని పేరు టూర్‌బిలాన్‌. హాంగ్‌కాంగ్‌లోని అమ్యూజ్‌మెంట్‌ పార్కులో ఉంటుందీ రైడు.....

Published : 14 Jul 2017 02:05 IST

గిర్ర్‌ర్‌ర్‌... భలే సాహసం!

సాహసికులు మాత్రమే చేసే రైడది. ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి మరి. ఎందుకంటే ఆ రైడు మలుపులు తిరగడం, పైకీ కిందకీ పల్టీకొట్టడం మాత్రమే చేయదు. ఏకంగా గుండ్రంగా తిప్పేస్తుంది. అన్ని కోణాల్లో చుట్టూ తిరిగిపోతుంది.

దీని పేరు టూర్‌బిలాన్‌. హాంగ్‌కాంగ్‌లోని అమ్యూజ్‌మెంట్‌ పార్కులో ఉంటుందీ రైడు.

* ఈ రైడు భలే గమ్మత్తుగా ఉంటుంది. రకరకాల పరిమాణాల్లో మొత్తం మూడు భారీ చతురస్రాలు ఒకదాంట్లో ఒకటి అమరి ఉంటాయి. అందులో చిన్నదానిపై సాహసికులు కూర్చోడానికి వీలుంటుంది. ఆ చతురస్రానికి రెండువైపులా సాహసికులు కూర్చుని సీటు బెల్టు పెట్టుకోగానే రయ్యిమంటూ పైకి వెళుతుంది. 70 అడుగుల ఎత్తులోకి దూసుకుపోతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు రైడు. మూడు చతురస్రాలు ఒక దాంట్లోంచి మరో దాంట్లోకి దూరిపోతూ స్పిన్‌బాల్‌లా గిరగిరా తిరిగేస్తాయి.

* ఇక అందులో రైడు చేసేవారి సంగతి చెప్పనక్కర్లేదు. గుండెజారిపోయినట్టు, కళ్లు బైర్లు కమ్మినట్టు, గాల్లో విసిరేసినట్టు, మన చుట్టూ మనమే గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రైడు పూర్తయ్యేసరికి ఉత్కంఠతో ఒళ్లంతా చమటలు పట్టి పేద్ద సాహసం చేసిన అనుభూతి మిగులుతుంది.

* గత ఏడాది ఏబీసీ రైడ్స్‌ వారు రూపొందించిన ఈ రైడు పర్యటకుల్ని తెగ ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని