అటు ఎడారి... ఇటు సముద్రం!

టూనీజియా... ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. అల్గేరియా, లిబియా దేశాలు, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులు. * ఫ్రాన్స్‌ నుంచి మార్చి 20, 1956లో ఈ దేశం స్వాతంత్య్రం పొందింది. * ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఈ దేశంలోనూ కొంత భాగం విస్తరించి ఉంటుంది....

Published : 24 Mar 2018 01:30 IST

టూనీజియా
అటు ఎడారి... ఇటు సముద్రం!

టూనీజియా... ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. అల్గేరియా, లిబియా దేశాలు, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులు.

* ఫ్రాన్స్‌ నుంచి మార్చి 20, 1956లో ఈ దేశం స్వాతంత్య్రం పొందింది.
* ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఈ దేశంలోనూ కొంత భాగం విస్తరించి ఉంటుంది.
* ఈ దేశంలో ముస్లిం జనాభా ఎక్కువ.
* పెట్రోలియం, గనులు, పర్యాటకం, వస్త్ర, పాదరక్షల పరిశ్రమలు అధికం.
* వేడి, పొడి వాతావరణం ఉంటుందిక్కడ. అందమైన సముద్ర తీరాలు పర్యాటకుల్ని తెగ ఆకట్టుకుంటాయి.
* అధికారిక భాష అరబిక్‌. కానీ ప్రజలు ఫ్రెంచ్‌ భాషనూ మాట్లాడేస్తారు.
* ఇక్కడి అడవుల్లో జంతువులు ఎక్కువ. పులులు, సింహాలు, చిరుతపులులు, హైనాలు, జింకలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.
* స్టార్‌ వార్స్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లకు పెట్టింది పేరిది.

దేశం: టూనీజియా 
రాజధాని: టూనీస్‌
జనాభా: 1,13,04,482
విస్తీర్ణం: 1,63,610 చ. కిలోమీటర్లు
భాష: అరబిక్‌
కరెన్సీ: టూనీజియన్‌ దినార్‌

* ఇక్కడ మత్‌మాతా అనే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ భూగర్భ ఇళ్లలో నివసిస్తున్నారు.
* వేడి, బలమైన ఎడారి గాలుల్నించి తప్పించుకోవడం కోసమే గుహల్లాంటి ఈ భూగర్భ ఇళ్లని నిర్మించుకున్నారట.
* ఈ ఇళ్లు 23 అడుగుల లోతు, 33 అడుగుల వెడల్పుతో ఉంటాయి.
* ప్రపంచం మొత్తంలో గుహల్లో నివసించే ట్రాగ్లోడైట్స్‌ జాతి ప్రజలు అత్యధికంగా ఉండేది ఇక్కడే. 

* సిది బో సైద్‌ అనే పట్ణణం మంచి సందర్శక ప్రాంతం. ఇక్కడ కట్టడాలన్నీ నీలం, తెలుపు రంగులతో ఉంటాయి.

* ఈ దేశంలో ఓ మంచి ఆకర్షణ ‘రోజ్‌ ఆఫ్‌ ది సహారా డిజర్ట్‌’ అనే పువ్వు. ఉప్పు, ఇసుకతో ఎడారిలో తయారవుతుందిది. అక్వేరియాల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు దీన్ని.

* ఒక టూనీజియన్‌ దినార్‌ మన కరెన్సీలో దాదాపు 27 రూపాయలకు సమానం.

* ఇక్కడి జాతీయ వంటకం ‘కాస్‌కాస్‌’. దీన్ని మాంసం, కూరగాయలతో చేస్తారు. 
* టమాటా, షుగర్‌ బీట్‌, బాదం, ఆలివ్‌లు, ఖర్జూర పండ్లు ఎక్కువగా పండుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని