కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 01 Aug 2022 00:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తమాషా ప్రశ్నలు

1. జనంలేని మండలం.. జనంలో ఉండే మండలం?
2. కాళ్లు లేని పోతు?
3. పొగలు కక్కే కాలు?


పొడుపు కథలు

1. జోడు గుర్రాల మీద ఒకడే రాజు. ఆ జోడు గుర్రాలు ఏంటో తెలుసా?
2. కంటికి కనిపిస్తుంది. ఒంటికి తగులుతుంది కానీ.. దొరకదు.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. ఎనిమిది కాళ్ల ఎర్రయ్యకు తల లేదు, తోక లేదు. ఏంటో తెలుసా?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 5, 6 అక్షరాలు కలిస్తే ‘వయసు’ అనీ.. 3, 1, 2, 6 అక్షరాలు కలిస్తే ‘నొప్పి’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి అయిదక్షరాలు కలిస్తే ‘కథ’ అనీ.. 4, 5, 7 అక్షరాలు కలిస్తే ‘బొమ్మ’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్నో చెప్పగలరా?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఏనుగులు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్ల వరకు ఈత కొట్టగలవు?
2. ఏ జీవి కన్ను దాని మెదడు కన్నా పెద్దగా ఉంటుంది?
3. స్వామి వివేకానంద అసలు పేరు ఏంటి?
4. ‘మానవసేవే మాధవ సేవ’ అని చెప్పింది ఎవరు?
5. వాననీటిలో ఏ విటమిన్‌ ఉంటుంది?


వాక్యాల్లో పక్షులు!

ఈ వాక్యాల్లో కొన్ని పక్షుల పేర్లు దాగి ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?
1. వరుసలో ముందో.. వెనకో.. డిన్నర్‌ కానిచ్చేయండి ముందు.
2. ఆ ఆవ నూనె.. మలి సంధ్యలో ఒంటికి రాసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటేనూ...

3. అవికా! కిటుకులు తెలిశాయా నీకు.. ఇప్పటికైనా!
4. అరరే.. మీరా..! బందున్నప్పుడు ఇలా వచ్చారేంటి?

5. నీలో అహం.. సగమే తగ్గింది. ఇంకా సగం అలాగే ఉంది.
6. ఈ బాబా.. తుపాకీ తూటాలకు భయపడతాడా?!


ఎవరో తెలుసా?!

ఇది ఓ క్రికెటర్‌కు సంబంధించిన చిన్ననాటి చిత్రం. ఈ ఆటగాడు ఎవరో తెలుసా?

జవాబులు:

తమాషా ప్రశ్నలు: 1.నాడీమండలం 2.జెర్రిపోతు 4.వంటకాలు

అక్షరాల పట్టిక: COLLABORATION

చెప్పగలరా? : 1.Charge  2.History

గజిబిజి బిజిగజి : 1.గుణవంతురాలు 2.సీతాకోకచిలుక 3.విగ్రహారాధన 4.ధ్రువతార 5.పుస్తకాలయం 6.గాజుపలక 7.సమరశంఖం 8. కపటవేషధారి

పొడుపు కథలు: 1.చెప్పులు 2.ఎండ 3.ఎండ్రకాయ

వీ‘రి’ పేరేమి?: 1.కరి 2.విరి 3.దారి 4.సరి 5.సిరి 6.వైరి 7.సారి 8.కోరి 9.భేరి 10.వరి

కవలలేవి? : 2, 4

క్విజ్‌.. క్విజ్‌..: 1.దాదాపు 32 కిలోమీటర్ల వరకు 2.ఆస్ట్రిచ్‌ 3.నరేంద్రనాథ్‌ దత్తా 4.రామకృష్ణ పరమహంస 5. బి12

వాక్యాల్లో పక్షులు: 1.కోడి 2.నెమలి 3.కాకి 4.రాబందు 5.హంస 6.బాతు

ఎవరో తెలుసా?: 1.విరాట్‌ కోహ్లీగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని