అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

Updated : 31 Oct 2022 00:58 IST

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. సూర్యుడు ఒక గ్రహం.

2. గొంగళిపురుగు తేనెటీగగా మారుతుంది.

3. ఎలుకకు రెండు జతల మొప్పలుంటాయి.

4. పెట్రోల్‌ ముడిచమురు నుంచి తయారవుతుంది.

5. కోయిలకు గూడు కట్టుకోవడం రాదు.

6. ఉక్కు నగరం అని విశాఖపట్నానికి పేరు.


నేనెవర్ని?

1.అయిదు అక్షరాల పదాన్ని. ‘పదవి’లో ఉంటాను. ‘పెదవి’లో ఉండను. ‘నరుడు’లో ఉంటాను. ‘వరుడు’లో ఉండను. ‘సతి’లో ఉంటాను. ‘పతి’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. ‘ఆరు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాల’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘గోడ’లో ఉంటాను. ‘గోడు’లో ఉండను. ‘విరి’లో ఉంటాను. ‘సిరి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో సరైన జతలను కనుక్కోండి చూద్దాం?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


తమాషా ప్రశ్నలు!

1. వీసా అడగని దేశం?
2. పగలు కూడా కనిపించే నైట్‌?
3. రక్తపాతానికి కారణమయ్యే గ్రామం ఏంటి?


జవాబులు:

నేనెవర్ని?: 1.పనసకాయ 2.అడవి పట్టికల్లో పదం!: బంగాళాఖాతం

అక్షరాల చెట్టు: ESTABLISHMENT

  రాయగలరా?: 1.కందిపప్పు 2.మొక్కజొన్న 3.కొర్రమీను 4.రాగిజావ 5.రావిచెట్టు 6.అన్నదాత 7.కొండముచ్చు 8.పిచ్చికుక్క 9.కొబ్బరి పీచు 10.కర్రసాము 11.గాలిమర 12.తెరచాప 13.బుర్రకథ 14.కోటగోడ 15.కీలుగుర్రం

అవునా.. కాదా..?: 1.కాదు 2.కాదు 3.కాదు 4.అవును 5.అవును 6.అవును

పదమాలిక: 1.సరదా 2.సరస్సు 3.సమోసా 4.సమాసం 5.సకలం 6.సమయం 7.సరళ

తమాషా ప్రశ్నలు!: 1.సందేశం 2.గ్రానైట్‌ 3.సంగ్రామం

ఏది భిన్నం?: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని