తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.

Updated : 20 Mar 2023 01:08 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలుగా మారతాయి.
ఒకసారి ప్రయత్నించండి.

1. లిరుపుతచి
2. టిఎబంగులు
3. కలురాచిమ
4. వుయిరాపా
5. కొంవలుచిడ
6. కకోతాచిసీలుక
7. గుగొంరుపుళిగ
8. వాముపాన
9. ముగునాపా


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘సింగారం’లో ఉంటాను కానీ ‘బంగారం’లో లేను. ‘హాస్యం’లో ఉంటాను కానీ ‘జోస్యం’లో లేను. ‘సర్వం’లో ఉంటాను కానీ ‘గర్వం’లో లేను. ‘జనం’లో ఉంటాను కానీ ‘జలం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘బల్ల’లో ఉంటాను కానీ ‘గుల్ల’లో లేను. ‘ఏరు’లో ఉంటాను కానీ ‘ఏడు’లో లేను. ‘రేవు’లో ఉంటాను కానీ ‘రేపు’లో లేను. నేను ఎవరిని?


జవాబులు:

తేడాలు కనుక్కోండి : చెట్టు, ఎలుగు వెనుక తేనెటీగ, పాత్ర పైన తేనెటీగ, కుందేలు చెవి, క్యారెట్‌, ఎలుగు కాలు

అక్షరాల చెట్టు :  ప్రధానోపాధ్యాయురాలు

రాయగలరా?: 1.మనోవేదన 2.పరివర్తన 3.గ్రామసింహం 4.మృగరాజు 5.మేఘమాల 6.వడగాలి 7.కడగండ్లు 8.పిండిమర 9.గుడిగంటలు 10.పరవశం 11.ప్రతీకారం 12.సోమవారం 13.భోజనశాల 14.ఆధిపత్యం 15.అనుకూలం

పదవలయం: 1.అడుగు 2.అలుసు 3.అరుపు 4.అన్యాయం 5.అమ్మకం 6.అరుదు 7.అదుపు 8.అరుగు

గజిబిజి బిజిగజి: 1.చిరుతపులి 2.ఎలుగుబంటి 3.రామచిలుక 4.పావురాయి 5.కొండచిలువ 6.సీతాకోకచిలుక 7.గొంగళిపురుగు 8.వానపాము 9.నాగుపాము

నేనెవర్ని? : 1.సింహాసనం 2.బరువు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని