అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 29 Nov 2023 00:54 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తమాషా ప్రశ్నలు!

1. రక్తం చిందని యుద్ధ రంగం?
2. పగలు కూడా కనిపించే నైట్‌?
3. చంపేసే రింగ్‌?
4. భయపెట్టే వరం?
5. గుర్తు చేసే కాలు?


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘గజం’లో ఉంటాను. ‘గళం’లో ఉండను. ‘రుతువు’లో ఉంటాను. ‘రుజువు’లో ఉండను. ‘గోవు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అరుదు’లో ఉంటాను. ‘బిరుదు’లో ఉండను. ‘నురుగు’లో ఉంటాను. ‘పెరుగు’లో ఉండను. ‘రావి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ‘గంప’లో ఉంటాను. ‘దుంప’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


అవునా..కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి.. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. నీటి ఏనుగు రక్తం కాస్త గులాబిరంగులో ఉంటుంది.
2. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లైబ్రరీ లండన్‌లో ఉంది.
3. టొమాటో కూరగాయలకు సంబంధించినది.
4. పిచ్చుక వెనక్కి కూడా ఎగరగలదు.
5. వన్డే ప్రపంచకప్‌- 2023లో ఎక్కువ వికెట్లు తీసింది షమీ.
6. పీతలకు గుండె చెవిలో ఉంటుంది.


జవాబులు

అక్షరాలచెట్టు: DETERMINATION

తమాషా ప్రశ్నలు!: 1.చదరంగం  2.గ్రానైట్‌  3.ఫైరింగ్‌  4.కలవరం  5.జ్ఞాపకాలు

నేనెవర్ని?: 1.జంతువు 2.అనురాగం

అవునా..కాదా..?: 1.అవును  2.అవును  3.కాదు  4.కాదు  5.అవును  6.కాదు 

అక్కడా.. ఇక్కడా..!: 1.మతి  2.నస  3.పట్టు  4.రసం 5.జనం

జత చేయండి: 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-డి 

అది ఏది?: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని