అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 25 Mar 2024 00:09 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి. అన్నీ ‘తం’ అక్షరంతోనే ముగుస్తాయి.

1.పాట 2.ఓ రుతువు 3.కలంతో దీని మీద రాస్తాం 4.చరిత్రను ఇలా కూడా అనొచ్చు 5.కలిసిపోవడం 6.తాత్కాలికం కాదు 7.వీడ్కోలుకు వ్యతిరేకం 8.మేఘం మరోలా..


అక్షరాల నిచ్చెన!

ఇక్కడున్న ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి.
1.ఓ పనిముట్టు 2. పక్షులను బంధించి ఉంచేది 3.పుణ్యం కానిది 4.దసరా, సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ 5.ఆగ్రహం 6.పులి - - 7.మునులు కోపంతో ఇచ్చేది 8.పరుగులో పోటీ 9.ప్రకృతి ప్రకోపం 10.పరవస్తు చిన్నయసూరి రచన


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


తప్పులే తప్పులు!

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘నెపం’లో ఉంటాను. ‘శాపం’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘గాలి’లో ఉంటాను. ‘గాజు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘హరిత’లో ఉంటాను. ‘సరిత’లో ఉండను. ‘కరి’లో ఉంటాను. ‘కరం’లో ఉండను. ‘చెవి’లో ఉంటాను. ‘చెద’లో ఉండను. ‘ఇల్లు’లో ఉంటాను. ‘ఇల’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు

అది ఏది?: 2
పదవలయం: 1.సంగీతం 2.వసంతం 3.కాగితం 4.చరితం 5.మిళితం 6.శాశ్వతం 7.స్వాగతం 8.జీమూతం
అక్షరాల నిచ్చెన!: 1.గునపం 2.పంజరం 3.పాపం 4.పండగలు 5.కోపం 6.పంజా 7.శాపం 8.పరుగుపందెం 9.భూకంపం 10.పంచతంత్రం
తప్పులే తప్పులు!: 1.అవహేళన 2.గజరాజు 3.గాలిమర 4.స్నేహితుడు 5.ఆత్మకథ 6.క్రమశిక్షణ 7.బాటసారి 8.ఆరాధన
పట్టికల్లో పదం!: తారకమంత్రం
నేనెవర్ని?: 1.నెమలి 2.హరివిల్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు