తేడాలు కనుక్కోండి

Published : 03 Apr 2024 00:34 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

 


నేనెవర్ని?

 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అన్నం’లో ఉంటాను. కానీ ‘సున్నం’లో ఉండను. ‘తను’లో ఉంటాను. కానీ ‘తమ’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. కానీ ‘వనం’లో ఉండను. ‘స్థితి’లో ఉంటాను. కానీ ‘స్థిరం’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘ఆయువు’లో ఉంటాను. కానీ ‘వాయువు’లో లేను. ‘యుద్ధం’లో ఉంటాను. కానీ ‘సిద్ధం’లో లేను. ‘ధనం’లో ఉంటాను. కానీ ‘దానం’లో లేను. ‘పూర్తి’లో ఉంటాను. కానీ ‘కీర్తి’లో లేను. ‘జలం’లో ఉంటాను. కానీ ‘కలం’లో లేను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం?


తప్పులే.. తప్పులు..!

కింద ఇచ్చిన పదాల్లో ఒక్కో అక్షరదోషం ఉంది. వాటిని సరిజేసి రాయండి.

1. ఆంతర్వేది
2. కోతిచేష్ఠలు
3. భక్తిశ్రద్దలు
4. నీళిమేఘాలు
5. వేకువజామూన
6. దైవధర్శనం
7. కలువగట్టు
8. నెరేడుపండు


బొమ్మ గీద్దాం

జవాబులు

తేడాలు కనుక్కోండి: ఫ్యాన్‌ ఎత్తు, పిల్లి కాలు, గొడుగు హ్యాండిల్‌, కిటికీ తెర, చేప, బాబు చేయి

తప్పులే.. తప్పులు..!: 1.అంతర్వేది 2.కోతిచేష్టలు 3.భక్తిశ్రద్ధలు 4.నీలిమేఘాలు 5.వేకువజామున 6.దైవదర్శనం 7.కాలువగట్టు 8.నేరేడుపండు

పదవలయం: 1.చలనం 2.చక్కెర 3.చదువు 4.చప్పుడు 5.చవితి 6.చమురు 7.చక్రాలు 8.చవక

అక్షరాలచెట్టు: FUNDAMENTAL

 బొమ్మల్లో ఏముందో?: 1.గీత 2.విమానం 3.బుట్ట 4.ఘటం 5.పిచ్చుక 6.పాలకూర 7.చెంచా 8.కొండ (దాగున్న సామెత: పిట్ట కొంచెం కూత ఘనం)

నేనెవర్ని?: 1.అనుమతి 2.ఆయుధపూజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని