అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 18 Apr 2024 01:14 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  గుడ్లగూబ ఓ క్షీరదం.

2. జపాన్‌ రాజధాని టోక్యో.

3. కుక్కను మార్జాలం అని పిలుస్తారు.

4. చంద్రుడు ఒక గ్రహం.

5. ఎవరెస్టు అనేది ఒక పర్వతం పేరు.

6. జెల్లీఫిష్‌కు రెండు గుండెలుంటాయి.

7. హమ్మింగ్‌ బర్డ్‌ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి.

8. కప్ప ఉభయచరజీవి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. దమాచంమ

2. రంపులిగాగో

3. లకోడుగంకి

4. బంలుగుఎటి

5. గనెటీతే

6. దాలరమామం

7. డుతగుమూలుదా

8. భిచిరుఅ


నేనెవర్ని?

1.  నేను నాలుగక్షరాల పదాన్ని. ‘మర’లో ఉంటాను. ‘అర’లో ఉండను. ‘దోమ’లో ఉంటాను. ‘దోర’లో ఉండను. ‘కాటు’లో ఉంటాను. ‘వేటు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘విరి’లో ఉంటాను. ‘కరి’లో ఉండను. ‘రోగి’లో ఉంటాను. ‘యోగి’లో ఉండను. ‘ఆయుధం’లో ఉంటాను. ‘ఆయుష్షు’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలుసా?


తమాషా ప్రశ్నలు!

1.  బంగారం దుకాణంలో దొరకని నగలు?

2. జుట్టులేని ఆడవారికి వరం?

3. ఏనుగులు ఎప్పుడు నిద్రపోతాయి?

4. ప్రాణాలు తీసే రింగ్‌?


బొమ్మల్లో ఏముందో?

కింద ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఖాళీ గడుల్లో పూరించండి.


జవాబులు

అది ఏది?: 2
రాయగలరా?: 1.కృష్ణజింక 2.పొగరుబోతు 3.పంచతంత్రం 4.రాజధాని 5.అపహాస్యం 6.అమావాస్య 7.నిఘానేత్రం 8.క్షేత్రపాలకుడు 9.భూస్థాపితం 10.తులసీదళం 11.కురుక్షేత్రం 12.రామచిలుక 13.రాజహంస 14.పాఠశాల 15.విజయకేతనం
అక్షరాల చెట్టు: BIODIVERSITY
అవునా.. కాదా..?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును 6.కాదు 7.అవును 8.అవును గజిబిజి బిజిగజి: 1.చందమామ 2.గాలిగోపురం 3.గండుకోకిల 4.ఎలుగుబంటి 5.తేనెటీగ 6.మందారమాల 7.దాగుడుమూతలు 8.అభిరుచి
నేనెవర్ని?: 1.మమకారం 2.విరోధం
తమాషా ప్రశ్నలు!: 1.శనగలు 2.సవరం 3.వాటికి నిద్రవచ్చినప్పుడు 4.ఫైరింగ్‌
బొమ్మల్లో ఏముందో?: 1.అరటిపండు 2.పందిరిమంచం 3.మందారపువ్వు 5.చందమామ 6.మామిడికాయ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని