ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 24 Apr 2024 01:06 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

నేనెవర్ని?

 1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘బలం’లో ఉంటాను. కానీ ‘కలం’లో ఉండను. ‘వేడి’లో ఉంటాను. కానీ ‘వేళ’లో ఉండను. ‘బాణం’లో ఉంటాను. కానీ ‘కోణం’లో ఉండను. ‘మాట’లో ఉంటాను. కానీ ‘మాయ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

 2. అయిదక్షరాల పదాన్ని నేను. ‘తాళం’లో ఉంటాను. కానీ ‘మేళం’లో ఉండను. ‘మట్టి’లో ఉంటాను. కానీ ‘ఉట్టి’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. కానీ ‘బువ్వ’లో ఉండను. ‘పురుగు’లో ఉంటాను. కానీ ‘పరుగు’లో ఉండను. ‘నవ్వు’లో ఉంటాను. కానీ ‘నక్క’లో ఉండను. నేనెవరినో తెలిసిందా?


చెప్పుకోండి చూద్దాం!

విక్కీ వాళ్లమ్మ ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు బయటకు తీయమని చెప్పింది. కానీ తను మాత్రం మిగతావి కూడా తీసేశాడు. అవేంటో చెప్పుకోండి చూద్దాం.
ఆపిల్‌, చాక్లెట్‌, మామిడిపండు, ఐస్‌క్రీం, ద్రాక్ష, పుచ్చకాయ, సొరకాయ, పైనాపిల్‌, బీరకాయ


జవాబులు
ఏది భిన్నం?:
అక్షరాల చెట్టు: INVESTIGATION 
బొమ్మల్లో ఏముందో?: 1.BAG 2.MOON 3.DOG 4.HAT 5.SNAKE 6.ICE 7.YOGA 8.BALL (HOLIDAYS) 
పదవలయం: 1.ఆచారం 2.ఉంగరం 3.శరీరం 4.ఉత్తరం 5.గోపురం 6.బంగారం 7.నగరం 8.ఆధారం
చెప్పుకోండి చూద్దాం!: చాక్లెట్‌, ఐస్‌క్రీం, సొరకాయ
నేనెవర్ని:  1.బడిబాట 2.తామరపువ్వు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని