వెలుగుల దీపావళి
దీపావళి ఆనందదాయకమైన పర్వదినం. లోకాల్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు, తన సతీమణి సత్యభామతో కలిసి సంహారం చేశాడు. నరకాసురుడి బాధలు తీరినందుకు గుర్తుగా టపాసులు పేలుస్తాం. చిచ్చుబుడ్డీల వెలుగుల్లో ఆనందంగా జరుపుకొంటాం. ఈ పండగకు అన్నలు చెల్లెలి ఇంటికెళ్లి భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళికి తులాసంక్రమణం ప్రారంభమవుతుంది. .....
వెలుగుల దీపావళి
అక్టోబరు 18 నరకచతుర్దశి
అక్టోబరు 19 దీపావళి
దీపావళి ఆనందదాయకమైన పర్వదినం. లోకాల్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు, తన సతీమణి సత్యభామతో కలిసి సంహారం చేశాడు. నరకాసురుడి బాధలు తీరినందుకు గుర్తుగా టపాసులు పేలుస్తాం. చిచ్చుబుడ్డీల వెలుగుల్లో పండుగను ఆనందంగా జరుపుకొంటాం. ఈ పండగకు అన్నలు చెల్లెలి ఇంటికెళ్లి భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళికి తులాసంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే చలి, చీకటి కలిసిన కాలం అన్నమాట. పితృదేవతలకు దారి చూపడం కోసం ప్రాచీన కాలంలో దీపాలు పెట్టేవారు. కాలక్రమేణా టపాసులు కూడా వచ్చాయి. నరకాసురుడు వరాహస్వామికి భూదేవికి జన్మించినవాడు. అయితే లోకకంటకుడైన పుత్రుడిని లోకకల్యాణం కోసం సత్యభామ హతమార్చుతుంది. ఆమె భూదేవి స్వరూపం. ధర్మకంటకుడిగా ఎవరు మారినా వారిని అణచేందుకు పరంధాముడు, మహాలక్ష్మి ఎలా వ్యవహరించారన్న అంశాన్ని ఈ ఘట్టం మనకు వివరిస్తుంది. త్రయోదశి రోజు రాత్రి వెలిగించే దీపం అపమృత్యువును నివారిస్తుంది. చతుర్దశి నాడు యముడికి తర్పణం వదిలి అనంతరం దీపం వెలిగించాలి. ఇలా చేస్తే నరకభయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..