వేడిక్కించే యోగా

కింది ఫొటో చూశారుగా. నిపుణులైన ఇద్దరు జిమ్నాస్ట్లు వేసిన చిత్రమైన పోజులా ఉంది కదూ!...

Published : 19 Jan 2016 11:53 IST

వేడిక్కించే యోగా

 

కింది ఫొటో చూశారుగా. నిపుణులైన ఇద్దరు జిమ్నాస్ట్‌లు వేసిన చిత్రమైన పోజులా ఉంది కదూ! కానీ అది అమెరికాలోని యువత బాగా ఇష్టపడుతున్న ‘ఇన్‌ఫ్రారెడ్‌ యోగా’లో ఓ ఆసనం. దీన్నే హాట్‌ యోగా అంటున్నారు. మిగతా యోగాలతో పోలిస్తే ఇందులోని ఆసనాలన్నీ ఒకేలా ఉంటాయి. చేసే చోటు మాత్రమే భిన్నం. ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీ వేడి వాతావరణం నింపిన ప్రత్యేకమైన గదుల్లో ఈ ఆసనాలేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడి వాతావరణంలో తేమ వేడిగా మారి అది శరీరాన్ని చేరి అంతఃగ్రంథులను శుద్ధి చేయడమే కాకుండా రక్తప్రవాహాన్ని సాఫీగా సాగిస్తుందట. న్యూయార్క్‌ నగరంలోని యోగా స్టూడియాల్లో ఈ ట్రెండ్‌ తాకిడి ఎక్కువగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని