అవకాడో.. చెలికాడు

కొన్ని తుంటరి ఆలోచనలు మనసును తుళ్లి పడేట్లు చేస్తాయి. అవకాడో లవ్‌ ప్రపోజల్‌ అలాంటిదే. తినే అవకాడో పండు ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేయటానికి ఉపయోగపడుతోంది....

Published : 24 Feb 2018 01:30 IST

‘కుర్రా’క్‌
అవకాడో.. చెలికాడు

కొన్ని తుంటరి ఆలోచనలు మనసును తుళ్లి పడేట్లు చేస్తాయి. అవకాడో లవ్‌ ప్రపోజల్‌ అలాంటిదే. తినే అవకాడో పండు ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేయటానికి ఉపయోగపడుతోంది. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటి పేజీల్లో ‘అవకాడో ప్రపోజల్‌’ అంటూ ట్యాగ్స్‌ ఎక్కువయ్యాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఇపుడిదో కొత్త ట్రెండ్‌. అవకాడో పండును సగానికి కోస్తారు. పండు మధ్యలో ఉండే గింజను తీసి కోడిగుడ్డు ఆకారంలో ఉండే భాగంలో ఉంగరాన్ని అమర్చుతారు. ప్రేమికురాలి దగ్గర అవకాడో పండులోని ఉంగరాన్ని తీసి వేలికి తొడుగుతారు. పెళ్లి ఫిక్స్‌ అయిన వాళ్లు కూడా ఇలాంటి అవకాడో ప్రపోజల్స్‌ చేస్తున్నారు. వాటిని సోషల్‌ వెబ్‌సైట్స్‌లో షేర్‌ చేస్తున్నారు.  అమ్మాయిలు మాత్రం ‘ఇదో కొత్తరకం పచ్చని ప్రేమానుభూతి’ అంటున్నారు. కూలెన్‌ డెక్‌ అనే ఫుడ్‌ స్టైలిస్ట్‌ మొన్న ప్రేమికుల రోజుకి ముందు ‘అవకాడోప్రపోజల్‌’ అంటూ సరదాగా ఓ ఫొటోను ఇన్‌స్టగ్రామ్‌లో షేర్‌ చేశాడంతే. పదకొండువేల లైక్స్‌, రెండువేల కామెంట్్స వచ్చాయి. అందరూ భలే అన్నారు. ఫాలో అయ్యారు. ఇదీ అవకాడో ప్రపోజల్‌ వెనకున్న అసలు కథ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని