AP High Court: పరకామణిలో చోరీ కేసు రాజీపై.. సమగ్ర దర్యాప్తు చేయండి
హైకోర్టు మూడు కీలక ఉత్తర్వులు
తితిదే బోర్డు అప్పటి ఛైర్మన్, అధికారులు, ఐవో, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సీఐడీ డీజీకి ఆదేశం
నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తునకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు
లోక్ అదాలత్‌లో రాజీ చేసిన మెజిస్ట్రేట్‌పై కీలక వ్యాఖ్యలు
ప్రొటోకాల్ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ
విచారణ డిసెంబరు 2కు వాయిదా 

ఈనాడు, అమరావతి: తితిదే పరకామణిలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతోపాటు తితిదే బోర్డు, అధికారులు, చోరీ కేసు దర్యాప్తు అధికారి(ఐవో), ఫిర్యాదుదారు/ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై.సతీష్‌కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సీఐడీ డీజీని ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు అందజేయాలని సూచించింది. సీఐడీ డీజీ ర్యాంక్ అధికారి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని స్పష్టంచేసింది.
మరోవైపు, నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యులు కూడబెట్టిన, ఇతరులకు అమ్మిన, కేటాయించిన స్థిర, చరాస్తులతో పాటు వారి బ్యాంక్ ఖాతాలపై ఏసీబీ డీజీ ర్యాంక్ పోలీసు అధికారితో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టే ఉన్నాయా, లేదా అన్నది తేల్చాలని పేర్కొంది. వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ నివేదికను సీల్డ్‌కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది.
చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీచేసిన అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం.. తాము జారీచేసిన ఈ తీర్పు ప్రతిని హైకోర్టు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇప్పటికే సీజ్ చేసి తమ ముందు ఉంచిన 16 బండిళ్లు (రికార్డులు) సీఐడీ డీజీకి అందజేయాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు స్పష్టంచేసింది. 2023 ఏప్రిల్ 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు పనిచేస్తూ, చోరీ కేసును రాజీ చేసిన తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వార్షిక రహస్య నివేదికలో(ఏసీఆర్) ఈ తీర్పు కాపీని పొందుపరచాలని రిజిస్ట్రార్ విజిలెన్స్‌ను ఆదేశించింది.
న్యాయవ్యవస్థలో పాలనాపరమైన పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆ న్యాయాధికారిని తక్షణమే ప్రొటోకాల్ విధుల నుంచి పక్కనపెట్టాలని అభిప్రాయపడింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తీర్పు ప్రతిని సంబంధిత పరిపాలన కమిటీ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని నిందితుడు, ఫిర్యాదుదారును ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఈ కీలక ఉత్తర్వులిచ్చారు.
కేసు నేపథ్యమిదీ..
పరకామణిలో 2023లో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం.శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ 10న తితిదే ఈవోకు వినతిపత్రమిచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అందులో ‘పరకామణి ఉద్యోగి సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో భారీగా నగదు, బంగారం అపహరించారు. దీనిపై ఏవీఎస్‌వో వై.సతీష్‌కుమార్ 2023 ఏప్రిల్ 29 తిరుమల వన్‌టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. అనూహ్యంగా సతీష్‌కుమార్ నిందితుడు రవికుమార్‌తో స్వచ్ఛందంగా లోక్ అదాలత్‌లో 2023 సెప్టెంబర్ 9న రాజీ చేసుకున్నారు’ అని ప్రస్తావించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. రికార్డులన్నింటినీ సీఐడీ ద్వారా సీజ్ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నాటి విచారణలో న్యాయమూర్తి కీలక ఉత్తర్వులిచ్చారు. వాటిలో ఏముందంటే..
409 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?
‘‘రికార్డులు పరిశీలిస్తే విచారణాధికారి, తితిదే అధికారులు, బోర్డు.. చోరీ కేసు నమోదు, రాజీ విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. కేసును విచారణకు తీసుకునేటప్పుడు (కాగ్నిజెన్స్), రాజీ ప్రక్రియను నమోదు చేసేటప్పుడు సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ అధికారి (పీవో) బుర్ర ఉపయోగించినట్లు కనిపించడం లేదు. పెదజీయంగార్ మఠం తరఫున రవికుమార్ 1985 అక్టోబర్‌లో పరకామణి పర్యవేక్షణ అధికారిగా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్ 29న చోరీ కేసు నమోదయ్యే నాటికి 38 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి (పబ్లిక్ సర్వెంట్) నిర్వచనం పరిధిలోకి వస్తారు.
అతనిపై ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం) కింద కేసు పెట్టి, దాని ఆధారంగానే విచారణ చేపట్టి ఉండాల్సింది. ఛార్జ్‌షీట్‌లోనూ 409 కింద అభియోగాలు మోపాల్సింది. కానీ, రాజీకి వీలున్న 379, 381 సెక్షన్లు మాత్రమే నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించకుండా, మైండ్ అప్లె చేయకుండా తిరుపతి మెజిస్ట్రేట్ అభియోగపత్రాన్ని 2023 మే 31న విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితుడికి సమన్లు జారీచేశారు. 409 సెక్షన్ పెట్టకపోవడమంటే.. ఐవో, న్యాయాధికారి తీవ్ర లోపానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం.
అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసు..
నిందితుడిని ఐవో అరెస్ట్ చేయకుండా సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు మాత్రమే ఇచ్చారు. కేసు డైరీలోనూ నిందితుడి ఆస్తులపై క్రైం బ్రాంచి, ఏసీబీ దర్యాప్తు చేసినట్లు లేదు. మొత్తంగా చూస్తే 2023 జూన్ 1 నాటికే రవికుమార్‌పై క్రిమినల్ చర్యలు ముగించినట్లు స్పష్టమవుతోంది. లాంఛనప్రాయంగా 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు తేటతెల్లమవుతోంది.
కానుకలకు దేవుడే యజమాని
తిరుమలలో భక్తులు ఇచ్చే కానుకలకు యజమాని.. దేవుడే అవుతారు. ఆ కానుకలపై స్వామివారి తరఫున తితిదే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అంటే, తితిదే ఆమోదం లేకుండా రాజీకి వీల్లేదు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన సతీష్‌కుమార్ స్వామివారి ఆస్తికి ఏవిధంగానూ యజమాని కాలేరు. చోరీ కేసుపై రాజీకీ అంగీకరించే అధికారం అతనికి లేదు. ఆ రాజీ చట్ట విరుద్ధం.
పత్రికలో ప్రకటన ఇవ్వకుండానే..
రవికుమార్, అతని కుటుంబ సభ్యులు తమ ఆస్తులను 2023 మేలో రెండు దఫాలుగా తితిదేకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆస్తులను బహుమతిగా అంగీకరించాలంటే తితిదే నిబంధనల ప్రకారం కనీసం 30 రోజుల ముందు పత్రికల్లో ఆ విషయాన్ని ప్రచురించాలి. తితిదే అప్పటి ఈవో, జేఈవోలు పత్రికా ప్రకటన ఇవ్వకుండానే రవికుమార్ ప్రతిపాదించిన గిఫ్ట్ డీడ్‌లను స్వీకరించేందుకు సిఫారసు చేశారు. దీనికి అప్పటి ఛైర్మన్ సాధారణంగా సమ్మతించారు. సంబంధిత ప్రొసీడింగ్స్‌లో రవికుమార్‌పై పరకామణిలో చోరీ కేసు ఉన్నట్లు ప్రస్తావించలేదు. పత్రికా ప్రకటన మినహాయింపు ప్రొసీడింగ్స్ తప్ప.. రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ఉత్తర్వులేవీ తమ వద్ద లేవని రికార్డులు సీజ్ చేసిన సమయంలో తితిదే అధికారులు సీఐడీకి వెల్లడించారు’’ అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిర్లక్ష్యమా? మోసపూరిత వైఖరా?
‘తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసు నిందితుడు సీవీ రవికుమార్‌పై నమోదైన క్రిమినల్ కేసును హడావుడిగా మూసివేసేందుకు చట్ట నిబంధనలు, పరిపాలనా పరమైన పద్ధతులను పూర్తిగా విస్మరించారు. ఇలా ఎందుకు చేశారో దీని వెనుకున్న వ్యక్తులు, అధికారులకే తెలుసు. ఇదంతా తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అధికారులు బుర్ర పెట్టకపోవడం వల్లా? లేక వారి సహకారం, మోసపూరిత వ్యవహార శైలితోనా? అన్నది తేలాలి.’
లోతైన దర్యాప్తు అవసరం
‘ఉద్యోగి అయిన రవికుమార్‌పై ఐపీసీ 409 సెక్షన్ కింద అభియోగాలు మోపకపోవడం సరికాదు. రవికుమార్, అతని కుటుంబ సభ్యులు శ్రీవారికి ఇస్తానన్న ఆస్తుల స్వీకరణకు 30 రోజుల ముందు నోటీసు ఇచ్చి పత్రికా ప్రకటన జారీ చేయాలన్న నిబంధనను ఎందుకు పక్కనపెట్టారు? ఆ ఆస్తుల స్వాధీనానికి తితిదే బోర్డు అప్పటి ఛైర్మన్ అంగీకరించడం, సంబంధిత ఉత్తర్వుల్లో చోరీ కేసును ప్రస్తావించకపోవడంపై లోతైన దర్యాప్తు అవసరం.’
ఏపీ హైకోర్టు
కేసు రాజీ వెనుక పెద్ద తలకాయలున్నాయి
సిట్‌తో దర్యాప్తు జరిపించండి
ఇంప్లీడ్ పిటిషన్ వేసినందుకు బెదిరింపులు వచ్చాయి
సాధు పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు
హైకోర్టులో సోమవారం జరిగిన విచారణలో ఏపీ సాధు పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదిస్తూ, ‘ఈ చోరీ కేసును మూసివేయడానికి హడావుడిగా పావులు కదిపారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకున్నారు. తితిదే బోర్డు ఆమోదించకుండా ఇలా చేసే అధికారం ఏవీఎస్‌వోకు లేదు. స్వామివారి ఆస్తులకు ఆయన యజమాని కాదు’ అని పేర్కొన్నారు. ‘తితిదేలో అప్పట్లో జరిగిన అక్రమాలకు ఈ చోరీ కేసు చిన్న ఉదాహరణ మాత్రమే. దీని రాజీ వెనుక పెద్ద తలకాయలున్నాయి. ఏయే కేసుల్లో రాజీ చేసుకోవాలి? ఎవరు రాజీ చేసుకోవచ్చు? తదితర విషయాలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు భిన్నంగా లోక్ అదాలత్‌లో ఈ కేసును రాజీ చేసుకున్నార’ని వాదించారు.
ఇంప్లీడ్ పిటిషన్ వేసినందుకు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. ‘తిరుపతి, తిరుమల వ్యవహారాలతో మీకేం పని అంటూ ఆయన్ను బెదిరిస్తున్నారు. రాజీ వెనుక కుట్ర లేకపోతే ఆయన్ను బెదిరించాల్సిన అవసరమేంటి? ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తు చేయాలి. సాధు పరిషత్‌ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చండి’ అని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్‌ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్‌ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్‌ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్‌రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
 - 
                        
                            

ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు.. విడదల రజని అనుచరులపై ఫిర్యాదు
 - 
                        
                            

ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి
 - 
                        
                            

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
 - 
                        
                            

కార్తిక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
 - 
                        
                            

పబ్లిక్‌లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
 


