Cyclone Montha: జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూంలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 05:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: మొంథా తుపాను నేపథ్యంలో జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆదేశాలిచ్చారు. తుపాను తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వీటిని కొనసాగించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ సూచించనట్లు తెలిపారు. ఇవీ ఆదేశాలు..

  • డ్రెయిన్లు, కాలువల గట్లు, నదీ గట్లు బలహీనంగా ఉన్న చోట పెట్రోలింగ్‌ చేపట్టాలి.
  • క్షేత్రస్థాయి సిబ్బంది ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వరదలు, వర్షాల సమయంలో నష్టాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
  • సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, టార్చ్‌లైట్లు, ఇసుక నింపిన సంచులు, ఖాళీ సిమెంటు సంచులు సిద్ధంగా ఉంచాలి.
  • డ్యాంలు, కాలువల షట్టర్లు, కాలువలపై ఉన్న ఇతర కట్టడాలు, సర్‌ప్లస్‌ ఎస్కేప్‌ల షట్టర్లు సరిగ్గా పనిచేసేలా తనిఖీ చేయాలి.
  • జనరేటర్లు, ఫ్యూయల్, లూబ్రికెంట్లు, యంత్ర పరికరాలను సిద్ధం చేయడంతో పాటు నిపుణులను అందుబాటులో ఉంచుకోవాలి.
  • డ్రెయిన్లలో పూడిక, తూడు, ఇతర అడ్డంకులను తొలగించాలి. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలి. 
  • తుపాను పరిస్థితులపై క్షేత్రస్థాయి సిబ్బంది జిల్లా కలెక్టర్లకు లిఖితపూర్వకంగా తెలియజేస్తుండాలి. ముఖ్య పరిణామాలపై విజయవాడలోని కేంద్ర వరద నియంత్రణ కేంద్రానికి సమాచారమివ్వాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు