3 జిల్లాల్లోని 37 మండలాల్లో కరవు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు-అమరావతి: ఖరీఫ్‌ పంటకాలంలో 3 జిల్లాల పరిధిలోని 37 మండలాలను కరవు ప్రభావితమైనవిగా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 25 కరవు మండలాలను ప్రకటించగా వాటిలో 12 తీవ్ర, 13 మధ్యస్థ కరవు ప్రాంతాలుగా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 3 మండలాల్ని మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, వాల్మీకిపురం, కురబలకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో మధ్యస్థ కరవుగా పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని అగలి, ఆమడగూరు, గాండ్లపెంట, హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, ఎన్‌పీకుంట, ఓడీ చెరువు, రామగిరి, రోళ్ల, తలుపుల, తనకల్‌ మండలాల్లో తీవ్ర కరవుగా ప్రకటించారు. అమరాపురం, బత్తపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, గుదిబండ, కదిరి, కనగానిపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, నల్లచెరువు, నల్లమడ, పుట్టపర్తి, సోమందేపల్లి మండలాల్లో మధ్యస్థ కరవుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో మధ్యస్థ కరవుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు