Nara Lokesh: సొంత పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వీఐపీ పాసులా?.. జగన్‌ తీరుపై లోకేశ్‌ సెటైర్లు

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 02 Sep 2025 12:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైకాపా కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’’ అంటూ జగన్‌ తీరును ఎండగట్టారు. 

అసలేం జరిగిందంటే..!

ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని విస్మయానికి గురిచేసింది. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్‌ సోమవారం పులివెందుల వచ్చారు. కొందరు కార్యకర్తలను మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కలుసుకున్నారు. పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. భద్రతా సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు