మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి కన్నుమూత

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పూర్వ నియోజకవర్గ కేంద్రం రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి(78) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. నెల్లూరులోని

Published : 15 Feb 2022 04:53 IST

రాపూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పూర్వ నియోజకవర్గ కేంద్రం రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి(78) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. 1994లో రాపూరు తెదేపా సంక్షోభంలో చిక్కుకుని నాయకత్వం లేకుండా పోయింది. అప్పట్లో శ్రీనివాసులురెడ్డి గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామం నుంచి రాపూరుకు వచ్చి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రాజకీయాలు ప్రారంభించారు. ఆ వెంటనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో రాపూరు టికెట్‌ దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అప్పటికే మాజీ మాజీ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డితో తలపడి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004లో తెదేపా తరఫున పోటీచేసి ఓడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని