Pingali Venkayya: దార్శనికుడి ఊరికీ.. దారేయలేరా?

భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేసిన మహనీయుడు.. మువ్వన్నెల పతాక రూపకర్త... పింగళి వెంకయ్య. ఆయన పుట్టిన ఊరు కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు.

Updated : 07 Jul 2023 08:21 IST

కేంద్ర మంత్రి చెప్పినా కార్యరూపం దాల్చలేదు

భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేసిన మహనీయుడు.. మువ్వన్నెల పతాక రూపకర్త... పింగళి వెంకయ్య. ఆయన పుట్టిన ఊరు కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు. ప్రస్తుతం ఈ గ్రామానికి చేరుకోవడానికి రోడ్లు సరిగాలేక అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 2022 జులై 30న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భట్లపెనుమర్రు గ్రామాన్ని సందర్శించారు. రహదారి అధ్వానంగా ఉండటం గమనించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు గ్రామ రహదారులతోపాటు కూచిపూడి నుంచి భట్లపెనుమర్రు వరకూ తారురోడ్డును నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాననీ.. అవసరమైతే ప్రధాని దృష్టికి తీసుకెళతానని.. ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆయన నిర్దేశించారు. నేటికీ ఆ రహదారి అభివృద్ధి కార్యరూపం దాల్చక.. ప్రజలు నరకం చూస్తున్నారు. కూచిపూడి నుంచి పెడసనగల్లు శివారు వరకూ వెళ్లే రోడ్డుతోపాటు.. కూచిపూడి నుంచి బార్లపూడి మీదుగా భట్లపెనుమర్రు చేరే పంచాయతీరాజ్‌ రహదారి (డొంకరోడ్డు) పూర్తిగా చిధ్రమైంది.

ఈనాడు కృష్ణా, న్యూస్‌టుడే, కూచిపూడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని