గుడారాల పండగ ప్రారంభం

గుంటూరు నగర శివారు గోరంట్లలోని హోసన్నా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో 47వ అంతర్జాతీయ గుడారాల పండగ గురువారం సాయంత్రం ప్రారంభమైంది.

Published : 08 Mar 2024 03:27 IST

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగర శివారు గోరంట్లలోని హోసన్నా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో 47వ అంతర్జాతీయ గుడారాల పండగ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. తమిళనాడు నుంచి వచ్చిన పాస్టర్‌ మోహన్‌ సీ లాజరస్‌ ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం దైవ సందేశాన్ని అందించారు. 1977లో తొలిసారి గుడారాల పండగ జరిగిందని, అప్పుడు 80 మందితో చేసుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు లక్షల మందితో పండగ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

బ్రదర్‌ ఏసన్న ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలు చేశారని, తర్వాత ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు దానిని కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమాల్లో హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు బ్రదర్‌ అబ్రహాం, చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ, బ్రదర్లు రాజు, ప్రైడిపాల్‌, రమేష్‌, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని