గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ

గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది.

Published : 28 Apr 2024 04:40 IST

తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు సతీష్‌

ఈనాడు, అమరావతి: గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని విజయవాడలోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయాధికారి రమణారెడ్డి ఎదుట హాజరుపర్చారు. తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించమని ఆదేశించారు. దీంతో పోలీసులు నిందితుడిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. మూడు రోజుల పోలీసుల కస్టడీలో నేరం తానే చేశానని అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఒకటో ఏసీఎంఎం కోర్టులో సతీష్‌ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయించనున్నారు. ఇదే ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం ఉంది.

చట్టవిరుద్ధ నిర్బంధంపై చర్యలు తీసుకోండి..

ఈ కేసులో తనను నాలుగు రోజులపాటు పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెదేపా నేత వేముల దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాన్ని ఒప్పుకోమని చిత్రహింసలకు గురిచేశారని.. ఇబ్బంది పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తన న్యాయవాది సలీంతో కలసి సీపీ రామకృష్ణకు వినతిపత్రం ఇచ్చేందుకు శనివారం కమిషనరేట్‌కు వెళ్లారు. సీపీ లేకపోవడంతో వెనుదిరిగారు. వినతిపత్రాన్ని పోలీసు కమిషనర్‌, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, గవర్నర్‌కు రిజిస్టర్డ్‌ పోస్టులో పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని