Airtel: డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్‌టెల్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published : 04 Dec 2023 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న టెలికాం సంస్థలు.. సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ ప్లాన్‌ పూర్తి వివరాలివే..

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన రూ.869 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. రోజుకు 64kbps వేగంతో 2 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 84 రోజుల కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌కు మూడు నెలలపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ (మొబైల్‌ వెర్షన్‌) సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటా యాక్సెస్‌ లభిస్తుంది. వీటితోపాటు మూడు నెలలపాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్‌ మెంబర్‌షిప్‌, ఉచిత హలో ట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్ యాక్సెస్ కూడా లభిస్తుంది. 

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇవే..

ఎయిర్‌టెల్‌ కంటే ముందు జియో కూడా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జ్‌ ప్లాన్‌ను అందిస్తుంది. దీని ధర రూ.808. ఇందులో కూడా  5జీ డేటా యాక్సెస్‌ ఉంది.  84 రోజుల కాలపరిమితితో అపరిమిత ఫోన్‌కాల్స్‌, రోజు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని