Airtel: టీ20 వరల్డ్‌కప్‌.. క్రికెట్‌ ప్రియుల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌

Airtel Prepaid Plan: క్రికెట్‌ యూజర్ల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

Published : 06 Jun 2024 00:04 IST

Airtel Prepaid Plan | ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ సీజన్‌ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారతీ (Bharati Airtel) ప్రత్యేక ప్లాన్‌ తీసుకొచ్చింది. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) నేపథ్యంలో క్రికెట్‌ ప్రియుల కోసం ప్రీపెయిడ్‌ ప్లాన్‌  (Prepaid Plan) ప్రవేశపెట్టింది. దీని రీఛార్జితో మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఇక ప్లాన్‌ వివరాలు ఏంటో చూసేద్దాం..

కొత్త రీఛార్జి ప్లాన్‌ ధర రూ.499. 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లేలో 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా వీక్షించే సదుపాయం లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు హలోట్యూన్‌, వింక్‌ మ్యూజిక్‌ సదుపాయం కూడా ఇస్తున్నారు. మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్ మెంబర్‌షిప్‌ కూడా పొందొచ్చు.

విద్యుత్‌ కారు ఓకే.. ఛార్జింగ్ సమయమే ప్చ్‌!.. ఈవీ యూజర్ల మనోగతమిదీ..

మరో ప్లాన్‌..

ఎటువంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఎయిర్‌టెల్‌ రూ.395తో మరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రీఛార్జిపై మొత్తం 6 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 56 రోజులకు 600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అన్ని ఎస్సెమ్మెస్‌లు వ్యాలిడిటీ ముగిసేలోపే వినియోగిస్తే.. ఆ తర్వాత లోకల్‌గా పంపే ఒక్కో మెసేజ్‌కు రుపాయి, ఎస్‌టీడీ ఎస్సెమ్మెలకు రూ.1.5 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్లాన్‌తో అపోలో 24|7 సర్కిల్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని