Bharti Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ

Eenadu icon
By Business News Team Published : 20 May 2025 15:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Bharti Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గూగుల్ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని యూజర్లకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. దీని కోసం గూగుల్‌తో జట్టుకట్టినట్లు వెల్లడించింది. పోస్ట్‌ పెయిడ్‌, వైఫై కస్టమర్లకు అదనపు స్టోరేజీ అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్‌, వైఫై కస్టమర్లు అదనపు ఖర్చు లేకుండా ఆరు నెలలకు 100జీబీ గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ను అందించనుంది. అయితే ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకొనే సదుపాయాన్ని టెలికాం అందిస్తోంది. అర్హులైన కస్టమర్లు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో లాగిన్‌ అయి ఈ ప్రయోజనాల్ని పొందొచ్చు. అయితే ఆరు నెలల తర్వాత స్టోరేజ్‌ కావాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందే. నెలకు రూ.125 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్లౌడ్‌ స్టోరేజీ సదుపాయం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. గూగుల్‌తో కలిసి ఈ సేవల్ని తీసుకురావడం ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్‌ సీఈఓ సిద్ధార్థ్‌ శర్మ అన్నారు. 

ఈ ప్లాన్లపై జియో 50 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ

టెలికాం సంస్థ జియో కూడా ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లపై 50జీబీ క్లౌడ్‌ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది. రూ.299, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసుకున్న వారికి ఈ క్లౌడ్‌ స్టోరేజీని ఇస్తోంది. అంతకంటే తక్కువ మొత్తం రీఛార్జి చేసిన వారికి 5 జీబీ డేటా మాత్రమే ఫ్రీ ట్రయల్‌ రూపంలో లభిస్తోంది. రూ.349, రూ.449, రూ.649, రూ.749, రూ.1549 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో అంతర్భాగంగా క్లౌడ్‌ స్టోరేజీని అందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు