IPO: ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీఓ
గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీఓ బుధవారం అంటే..ఇంకో రోజు మిగిలి ఉండగానే, మంగళవారం నాటికే 1.09 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ ఐపీఓ రెండవ రోజునే(మార్చి 14న) పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూ మార్చి 15న ముగియనుంది. 77.49 లక్షల షేర్లకుగాను 84.23 లక్షల ఈక్విటీ షేర్లకు బిడ్‌లను అందుకుంది. కంపెనీ ఒక షేరు ధర రూ.133-140గా నిర్ణయించింది. చివరి రోజు మధ్యాహ్నం 12.50 గంటల నాటికి ఇష్యూ 4.24 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. మార్కెట్ పరిశీలకుల ప్రకారం, నేడు గ్రే మార్కెట్‌లో గ్లోబల్ సర్ఫేసెస్ షేర్లు రూ.14 ప్రీమియం(GMP)ని కలిగి ఉన్నాయి. కంపెనీ షేర్లు వచ్చే వారం మార్చి 23న ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలు(BSE, NSEలలో) లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు. ప్రైస్ బాండ్ ఎగువ ముగింపులో, కంపెనీ ప్రారంభ వాటా విక్రయం నుంచి రూ.155 కోట్లు పొందవచ్చని అంచనా. సహజ రాళ్లను ప్రాసెస్ చేయడం, ఇంజినీరింగ్ క్వార్ట్జ్ తయారీలో ఉన్న గ్లోబల్ సర్వీసెస్ దాని ప్రారంభ వాటా విక్రయానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.46.49 కోట్లను సేకరించినట్లు కంపెనీ తెలిపింది.
గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీఓలో తాజాగా 85.20 లక్షల ఈక్విటీ షేర్లు జారీ అయ్యాయి. ప్రమోటర్లు మయాంక్‌షా, శ్వేతాషా ద్వారా 25.5 లక్షల వరకు ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) ఉన్నాయి. తాజా జారీ ద్వారా సేకరించిన నిధులు దుబాయ్‌లో కంపెనీ ప్రతిపాదిత..గ్లోబల్ సర్ఫేసెస్ 'FZE' ఏర్పాటుకోసం ఉపయోగిస్తారు. కంపెనీ ఆదాయం 98% ఎగుమతుల ద్వారా వస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ EBITDA మార్జిన్ 21.97%గా నివేదించింది. గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ సహజ రాళ్లను ప్రాసెస్ చేయడం, ఇంజినీరింగ్ క్వార్ట్జ్ తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. కంపెనీకి రాజస్థాన్‌లో 2 తయారీ యూనిట్లు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ